Chapati With Beetroot Carrot Pulp: సాధారణంగా చాలా మంది కూరగాయలతో జ్యూస్‌లు తయారు చేసుకొని తాగుతుంటారు. ఈ జ్యూస్ తయారు చేసిన తరువాత అందులో ఉండే తొట్కకు, గుజ్జులను వ్యర్థంగా భావిస్తారు. కానీ వీటిలో కూడా బోలెడు ఆరోగ్యలాభాలు ఉంటాయని చాలా మందికి తెలియదు. అయితే వీటిని పారేయకుండా దీంతో రుచికరమైన చపాతీలను తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా..?
బీట్‌రూట్ క్యారెట్ గుజ్జు చపాతీ వల్ల కలిగే లాభాలు:
బీట్‌రూట్, క్యారెట్ గుజ్జుతో తయారు చేసిన చపాతీలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఇవి రుచికరమైనవి మాత్రమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. బీట్రూట్‌లో ఐరన్, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. క్యారెట్‌లో విటమిన్ A, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, చర్మాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులోని నైట్రేట్స్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. ఈ చపాతీలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. బీట్రూట్, క్యారెట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్‌లను తగ్గించడంలో సహాయపడతాయి. క్యారెట్‌లో ఉండే విటమిన్ A కళ్ళ ఆరోగ్యానికి మంచిది. బీట్రూట్, క్యారెట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ సేపు ఆకలి తీరదు. దీంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
బీట్‌రూట్ క్యారెట్ గుజ్జు చపాతీ తయారీ విధానం:
ఈ రెసిపీ తయారు చేయడం ఎంతో సులభం. @cooking_by_gurulakshmi బీట్‌రూట్ అలాగే క్యారెట్ గుజ్జుతో చపాతీ ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
బీట్రూట్, క్యారెట్ తొక్కలు, ముక్కలు
గోధుమ పిండి
ఉప్పు
నీరు
నూనె
కొత్తిమీర
తయారీ విధానం:
బీట్రూట్, క్యారెట్ తొక్కలు, ముక్కలను శుభ్రంగా కడిగి, చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి. ఈ ముక్కలను మిక్సీ జార్‌లో వేసి, కొద్దిగా నీరు పోసి మెత్తగా రుబ్బుకోండి. ఒక పాత్రలో గోధుమ పిండి, ఉప్పు వేసి బాగా కలపండి. ఇప్పుడు రుబ్బిన బీట్రూట్, క్యారెట్ మిశ్రమాన్ని పిండిలో వేసి, కొద్ది కొద్దిగా నీరు పోసి మృదువైన ముద్ద చేయండి. మీకు నచ్చినంత మృదువుగా ఉండేలా నీరు కలపండి. కొత్తిమీర ఆకులను చిన్నగా తరిగి ముద్దలో కలపండి. ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసి, చపాతీలు వలె వేయించుకోండి.
చిట్కాలు:
మరింత రుచి కోసం, కొద్దిగా జీలకర్ర పొడి లేదా కారం కూడా కలిపి చేయవచ్చు.
పిల్లలకు ఆకర్షణీయంగా ఉండేలా చపాతీలను వివిధ ఆకారాల్లో చేయవచ్చు.
ఈ చపాతీలను పప్పు, కూరలతో కలిపి భోజనం చేయవచ్చు.
ఇదీ చదవండి: ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపైనే బాంబు దాడులు.. వీడియో వైరల్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter