No Tobacco Day 2024: స్మోకింగ్‌ చేసేవారికి 5 అనారోగ్య సమస్యలు తప్పవు.. ఈ లక్షణాలు కనిపిస్తే జరభద్రం..

No Tobacco Day 2024: మధ్యపానం, ధూమపానం చేసేవారు ఈ ప్రపంచంలో కోకోల్లలు. దీనికి అవగాహన సదస్సు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. ఈ ప్రత్యేక రోజును వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది. 

Written by - Renuka Godugu | Last Updated : May 30, 2024, 07:44 PM IST
No Tobacco Day 2024: స్మోకింగ్‌ చేసేవారికి 5 అనారోగ్య సమస్యలు తప్పవు.. ఈ లక్షణాలు కనిపిస్తే జరభద్రం..

No Tobacco Day 2024: మధ్యపానం, ధూమపానం చేసేవారు ఈ ప్రపంచంలో కోకోల్లలు. దీనికి అవగాహన సదస్సు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. ఈ ప్రత్యేక రోజును వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది. అయితే ప్రతి సంవత్సరం మే 31వ తేదీన పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. పొగాకు తీసుకోవడం వల్ల జరిగే అనారోగ్య సమస్యల గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ప్రతి ఏడాది డబ్ల్యూహెచ్ఓ నిర్వహిస్తుంది. ధూమపానం చేసే వారికి స్ట్రోక్, గుండె సమస్యలు, క్యాన్సర్ , శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి. మితిమీరితే ప్రాణాలు పోయే పరిస్థితికి చేరుకుంటుంది.ప్రతి ఏడాది పొగాకు వ్యతిరేక దినోత్సవానికి ఒక్కో నేపథ్యం ఉంటుంది. ఈ ఏడాది 'Protecting children from tobacco industry interference' నేపథ్యంతో పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహించనున్నారు. పొగాకు వల్ల కలిగే అనర్ధాలు ఏంటో తెలుసుకుందాం.

ఊపిరితిత్తుల క్యాన్సర్..
పొగాకు తీసుకునే వారిలో వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది. పొగాకు వల్ల లంగ్స్ లో క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందుతాయి. దీని లక్షణాలు విపరీతంగా దగ్గు, చాతినొప్పి, బరువు తగ్గిపోవడం, నిద్రలేమి సమస్యలతో పోరాడుతారు.

ఊపిరితిత్తుల వ్యాధులు...
పొగాకు తీసుకునే వారిలో ఊపిరితిత్తుల వ్యాధులతోపాటు శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది, నిద్రలేమి సమస్య వస్తుంది.

 గుండె సమస్యలు..
 పొగాకు తీసుకునేవారు అందులో కెమికల్స్ రక్తనాళాల్లోకి వెళ్లి డ్యామేజ్ చేస్తాయి. అధర క్లోరోసిస్ బారిన పడతారు. రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. దీంతో గుండె ప్రమాదంలో పడుతుంది. హార్ట్ ఎటాక్, చాతినొప్పి,  హాట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు వచ్చి ప్రాణాలు పోయే పరిస్థితిలో ఏర్పడతాయి.

 స్ట్రోక్..
అంతేకాదు స్మోకింగ్ చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయి. బ్లడ్ లో రక్తనాళాలు గడ్డకట్టుకపోవడం వంటివి చూస్తూనే ఉంటాం. ఇది బ్రెయిన్ కి చేరిందంటే ప్రాణాంతక పరిస్థితి ఏర్పడుతుంది. బ్రెయిన్ డ్యామేజ్ చేస్తూ పెరాలసిస్ కి కూడా దారితీస్తుంది. కొన్ని పరిస్థితుల్లో ప్రాణాలు కూడా పోతాయి.

ఫెరిఫరల్ అర్టెరీ డిసీజ్..
పొగాకు ఎక్కువగా తీసుకోవటం వల్ల అర్టెరీ డిసీజ్ వచ్చే ప్రమాదం ఉంది. అంటే రక్త సరఫరా తగ్గిపోతుంది. దీంతో నొప్పి, తిమ్మిరి, స్పర్శలేమికి దారి తీస్తుంది.

ఇదీ చదవండి:  చీజ్‌ ఎముకలకు బలం.. మీ డైట్లో చీజ్‌ చేర్చుకుంటే 5 ఆరోగ్య ప్రయోజనాలు..

శ్వాస సమస్యలు..
స్మోకింగ్ చేయడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ దెబ్బతింటుంది. శ్వాసనాళాలు దెబ్బతింటాయి. ఇన్ఫెక్షన్ బారిన పడతారు దీంతో న్యూమోనియా వంటి వ్యాధులు వస్తాయి. దీంతో శాస సంబంధిత సమస్యలతో హెల్త్ పై ప్రభావం చూపుతుంది.

సంతానలేమి..
పొగాకు తీసుకోవటం వల్ల ఫెర్టిలిటీ సమస్యలు వస్తాయి. ఆడ, మగవారిలో సంతాన ఉత్పత్తి సమస్యలు వస్తాయి. ఒక్కోసారి అబార్షన్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి.

 టైప్ 2 డయాబెటిస్..
అంతేకాదు స్మోకింగ్ అధికంగా చేసుకునే వారికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉండవు డయాబెటిస్ కి దారితీస్తుంది. దీంతో డయాబెటిక్ న్యూరోపతి, కిడ్నీ డిసీజ్‌, కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఏర్పడుతుంది.

ఇదీ చదవండి:  తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండేందుకు చిట్కా..

ఇమ్యూనిటీ వ్యవస్థ..
ధూమపానం చేయడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ దెబ్బ తింటుంది. ఇన్ఫెక్షన్ నుంచి పోరాడే శక్తి తగ్గిపోతుంది. ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే నయం కావడానికి చాలా టైం పడుతుంది.

పంటి సమస్యలు..
ధూమపానం అతిగా చేసేవారిలో పంటి చిగుళ్ళకు రక్త సరఫరా తగ్గిపోతుంది. దీంతో బ్యాక్టీరియా పెరుగుదల కనిపిస్తుంది ఫలితంగా చిగుళ్లలో రక్తం, శ్వాస దుర్వాసన, పళ్లు ఊడిపోయే ప్రమాదం కూడా ఉంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News