Reduce Ldl Cholesterol: బరువు పెరగడం వల్ల ఎన్ని రకాల సమస్యలు వస్తాయో అందరికీ తెలిసిందే. కొంతమంది బరువు పెరగడం కారణంగా కూర్చుని లేవడానికి తెగ కష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా మరికొందరు దీర్ఘకాలిక వ్యాధుల బారిన కూడా పడుతున్నారు. బరువు తగ్గడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. ఇలాంటి సమస్యతో బాధపడేవారు తప్పకుండా ఆహారాలను డైట్ పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటు వ్యాయామాలు చేయడం వల్ల చక్కటి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చాలామంది ప్రస్తుతం బరువు తగ్గడానికి కీటో డైట్లను అనుసరిస్తున్నారు. ఈ డైట్ ఎంతో ప్రసిద్ధి. అయితే ఈ పద్ధతిలో ఆహారాలు తీసుకోవడమే కాకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని డ్రింక్స్ ను ప్రతిరోజు తాగడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ డ్రింక్స్ ను తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా శరీరంలోని కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోతుందని వారు అంటున్నారు. అంతేకాకుండా ఈ డ్రింక్స్ ను పొట్ట సమస్యలతో బాధపడే వారు కూడా ప్రతిరోజు తాగవచ్చు. అయితే ఈ డ్రింక్స్ ను ఎలా తయారు చేసుకోవాలో.. వీటిని తాగడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి
బరువు తగ్గాలనుకునేవారు శరీరంలోని కొలెస్ట్రాల్ నియంత్రించుకోవాలనుకునేవారు ప్రతిరోజు ఓట్స్ మిల్క్ ను అల్పాహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా తీవ్ర వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పరిశోధనల ప్రకారం 120 ఎంఎల్ ఓట్స్ మిల్క్ లో ఒక గ్రాము బీటా గ్లూకాన్ లభిస్తుంది. కాబట్టి ఈ మెల్కును కొలెస్ట్రాల్ బరువు తగ్గించుకోవాలనుకునేవారు ప్రతిరోజు ఉదయం తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
ఒంట్లో ఉన్న కొలెస్ట్రాలను కరిగించుకోవడానికి టమోటో రసం ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఆరోగ్య నిపుణులు సూచించిన వివరాల ప్రకారం.. రెండు నెలలపాటు ప్రతిరోజు 280 ML టమాటో రసం తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు జీర్ణ క్రియను మెరుగుపరిచేందుకు కూడా సహాయపడతాయి. కాబట్టి తరచుగా జీర్ణ క్రియ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రసాన్ని తాగాల్సి ఉంటుంది.
Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి