Reduce Belly Fat in 8 Days with these Tips: ప్రస్తుతం చాలా మంది బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు విచ్చలవిగా పెరగడమనే ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బెల్లీ ఫ్యాట్ పెరగడం కారణంగా చాలా మందిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చాలా మందిలో గుండెపోటుతో పాటు మధుమేహం సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్నవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా డైట్ పద్ధతిలో ఆహారాలు తీసుకోవడం వల్ల సులభంగా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే బెల్లీ ఫ్యాట్ నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రోటీన్ గల ఆహారాలు తీసుకోండి:
డైట్‌లో భాగంగా బెల్లీఫ్యాట్‌ను నియంత్రించుకోవడానికి తప్పకుండా మాక్రోన్యూట్రియెంట్ ప్రోటీన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజూ 441 తక్కువ కేలరీలు గల ఆహారాలు తీసుకుంటేనే సులభంగా బెల్లీఫ్యాట్ నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా దీని వల్ల జీర్ణక్రియ సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. కాబట్టి ప్రతి రోజు గుడ్లు, చేపలు, బీన్స్, గింజలు, మాంసం ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఫైబర్-రిచ్ ఫుడ్స్ తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది:
బెల్లీఫ్యాట్‌ను తగ్గించుకోవడానికి తప్పకుండా ఫైబర్-రిచ్ ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల అకలి నియంత్రణలో ఉండి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపుతో ఉంటాయి. కాబట్టి బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకునే డైట్‌లో పండ్లు, కూరగాయలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఫుడ్స్ తీసుకునే క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా చక్కెర కలిగిన ఆహారాలు తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Cholesterol Levels: ఎలాంటి ఖర్చు లేకుండా ఈ పువ్వు టీతో కొలెస్ట్రాల్, బీపీకి శాశ్వతంగా చెక్!
వ్యాయామాలు తప్పని సరి:
పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి తప్పకుండా వ్యాయామాలు చేయడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ వ్యాయామాలు చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గడమేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా యోగా చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి.
7-8 గంటల నిద్ర తప్పనిసరి:
శరీరం ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా 7 నుంచి 8 గంటల పాటు నిద్ర పోవాల్సిందే. ప్రస్తుతం చాలా మంది నిద్రలేక పోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి చాలా మంది ప్రస్తుతం డైట్‌ను పాటిస్తున్నారు. ఇదే క్రమంలో శరీరానికి కావాల్సిన విశ్రాంతిని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. శరీరానికి తగిన విశ్రాంతిని ఇవ్వడం వల్ల జీర్ణక్రియ ఇతర అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్, కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. కాబట్టి తప్పకుండా బెల్లీఫ్యాట్ తగ్గడానికి 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాల్సి ఉంటుంది.
Also Read: Cholesterol Levels: ఎలాంటి ఖర్చు లేకుండా ఈ పువ్వు టీతో కొలెస్ట్రాల్, బీపీకి శాశ్వతంగా చెక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి