Rice Latest Side Effects: అన్నం అతిగా తింటున్నారా? మీకోసం హాస్పిటల్లో బెడ్ రెడీ ఉన్నట్లే..

Rice Latest Side Effects In Telugu: చాలామంది అధిక పరిమాణంలో అన్నం తింటూ ఉంటారు. కొంతమంది అయితే రోజులు మూడు నుంచి నాలుగు సార్లు కూడా తింటారు. నిజానికి ఇలా తినడం శరీరానికి అంత మంచిది కాదు. దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Nov 10, 2024, 12:40 PM IST
Rice Latest Side Effects: అన్నం అతిగా తింటున్నారా? మీకోసం హాస్పిటల్లో బెడ్ రెడీ ఉన్నట్లే..

Rice Latest Side Effects In Telugu: అన్నం ప్రతిరోజు తినడం చాలా మంచిదే అయినప్పటికీ.. కొన్ని కొన్ని సందర్భాల్లో అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. ముఖ్యంగా చాలామంది అధిక పరిమాణంలో రోజు అన్నం తింటూ ఉంటారు. నాలుగు నుంచి ఐదు పూటలు అన్నం తింటారు. నిజానికి ఇలా ఎక్కువగా అన్నం తినడం అంత మంచిది కాదు. ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వారు ఎక్కువగా అన్నం తినడం మానుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యల భారిన పడే ఛాన్స్ ఉంది. ఇటీవలే జరిపిన అధ్యయనాల ప్రకారం అన్నాన్ని ఎక్కువ మోతాదులో తినడం వల్ల కొంతమందిలో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయని తేలింది. అయితే అన్నాన్ని ఎక్కువగా తింటే వచ్చే ఆ వ్యాధులు ఏంటో? వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

అతిగా అన్నం తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు: 
ఊబకాయం: 

చాలామంది ఎక్కువ మోతాదులో అన్నం తింటూ ఉంటారు. నిజానికి ఇలా తినడం చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే అతిగా అన్నం తింటే శరీరంలో కార్బోహైడ్రేట్ల పరిమాణం విపరీతంగా పెరిగిపోతుంది. రోజు నాలుగు నుంచి ఐదుసార్లు అన్నం తినడం వల్ల శరీర బరువు పెరిగి.. శరీరంలో కొవ్వు నిలువలు కూడా విపరీతంగా పెరుగుతాయని దీనికి కారణంగా ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ఛాన్స్ కూడా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

మధుమేహం:
అన్నంలో అధిక మోతాదులో కార్బోహైడ్రేట్లు లభిస్తాయి.. కాబట్టి రోజు ఎక్కువసార్లు తినడం వల్ల ఇవి శరీరంలోని రక్తంలో చక్కెర పరిమాణాలను పెంచే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా మధుమేహం ప్రమాదం కూడా పెరుగుతుంది. అలాగే ఇప్పటికే మధుమేహంతో బాధపడుతున్న వారికి కూడా రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరిగే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

జీర్ణ సమస్యలు: 
చాలామందిలో అతిగా అన్నం తినడం వల్ల అనేక రకాల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇటీవల అధ్యయనాల్లో తేలింది. అన్నం ఎక్కువగా తింటే అజీర్ణం, గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో రకాల పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారు అతిగా అన్నం తినడం మానుకుంటే చాలా మంచిది. 

గుండె సంబంధిత వ్యాధులు: 
అన్నం ఎక్కువగా తింటే గుండె సంబంధిత వ్యాధులు కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే శరీరంలోని షుగర్ లెవెల్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి అన్నం ఎక్కువగా తినడం వల్ల ఈ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. 

Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?  

కాలేయ వ్యాధులు: 
కొంతమందిలో అన్నం ఎక్కువగా తినడం వల్ల ఏర్పడే కొన్ని రసాయనాలు కాలేయంపై కూడా ప్రభావాన్ని చూపుతాయి. దీనివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు రావచ్చు. కాలేయం మొత్తం చెడిపోయి ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ఛాన్స్ కూడా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

శరీర బలహీనత: 
ఎక్కువ మోతాదులో అన్నాన్ని తినడం వల్ల కేవలం శరీరానికి కార్బోహైడ్రేట్స్ మాత్రమే లభిస్తాయి. దీనికి కారణంగా శరీరానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే తగిన మోతాదులో పోషకాలు కూడా లభించకుండా ఉంటాయి. అయితే దీనివల్ల శరీరానికి శక్తి తగ్గిపోయి శరీర బలహీనత వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News