Seeds For Health: ఈ గింజల లాభాలు తెలిస్తే ఎక్కడున్న కొనుకున్ని ప్రతి రోజు తింటారు!

Seeds For Health In Telugu: శరీర ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారాలతో పాటు గింజలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. అంతేకాకుండా శరీర బరువును నియంత్రిస్తాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 19, 2024, 04:26 PM IST
 Seeds For Health: ఈ గింజల లాభాలు తెలిస్తే ఎక్కడున్న కొనుకున్ని ప్రతి రోజు తింటారు!

 

Seeds For Health In Telugu: జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్‌కు దూరంగా ఉండడమే కాదు..ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారాలు, సహజ కొవ్వులు, పోషకాలు తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవి అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు తీసుకోవడం వల్లే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా శరీరం కూడా ఫిట్‌గా ఉంటుంది. అయితే ఇవన్నీ లాభాలు పొందడానికి ప్రతి రోజు తప్పకుండా అద్భుతమైన పోషకాలు కలిగిన గింజలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయి. అయితే ప్రతి రోజు ఏయే గింజలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..

అవిసె గింజలు: 
అవిసె గింజలు పురుషుల కంటే మహిళలకు ఎక్కువ లాభాలను కలిగిస్తాయి. ఇందులో ఉండే గుణాలు శరీరానికి బోలెడు లాభాలను అందిస్తాయి. ముఖ్యంగా వీటిని గర్భిణీ స్త్రీలు తీసుకోవడం మంచి ఫలితాలు పొందుతారు. వీటిని ప్రతి రోజు తినడం వల్ల పుట్టబోమే బిడ్డ కూడా ఎంతో హెల్తీగా ఉంటాడు. అంతేకాకుండా ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ పెరగకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు చర్మ సమస్యల నుంచి కూడా విముక్తి కలిగించేందుకు సహాయపడుతుంది.  ఈ గింజలను ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి  6 గ్రాముల ఫైబర్, 4 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. 

చియా విత్తనాలు:
చియా గింజలను రాత్రంతా నానబెట్టి తినడం ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ఫైబర్‌ శరీర బరువు తగ్గింస్తుంది. దీంతో పాటు ఈ గింజలను ప్రతి రోజు తినడం వల్ల 10 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. ఇందులో ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, కాల్షియం అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా  మెగ్నీషియం మరియు జింక్ కూడా ఉన్నాయి. అందుకే బరువు తగ్గడానికి చియా సీడ్స్ తినడం మంచిది. ఇది శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తుంది.

పొద్దుతిరుగుడు విత్తనాలు:
ప్రతి రోజు పొద్దుతిరుగుడు విత్తనాలను తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. అలాగే ప్రోటీన్స్‌ కూడా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు వీటిని ఆహారంలో వినియోగించడం వల్ల శరీరానికి విటమిన్‌ E అధిక పరిమాణంలో లభిస్తుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యం కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు రోగనిరోధక శక్తి కూడా సులభంగా పెరుగుతుంది. 

గుమ్మడికాయ గింజలు:
గుమ్మడి గింజలు తినడం వల్ల కూడా శరీరానికి అనేక రకాల లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే మూలకాలు స్త్రీలకు ప్రభావంతంగా సహాయపడతాయి. అంతేకాకుండా ఇందులో 16 శాతం ఐరన్‌ లభిస్తుంది. కాబట్టి ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. దీంతో పాటు ఇందులో అమైనో ఆమ్లాలు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, జింక్ అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి వీటిని బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు తీసుకోవడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News