Skin Care Tips: వర్షాకాలంలో మొటిమల సమస్య బాధిస్తోందా, రోజూ ఇలా ఈ చిట్కాలు పాటిస్తే చాలు

Skin Care Tips: వర్షాకాలం వాతావరణం ఆహ్లాదం కల్గించినా వ్యాధులు మాత్రం చుట్టుముడుతుంటాయి. వివిధ రకాల వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు అధికమౌతాయి. ముఖంపై మొటిమలలో అందం దెబ్బతింటుంది. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా..ఆ వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 23, 2023, 11:07 PM IST
Skin Care Tips: వర్షాకాలంలో మొటిమల సమస్య బాధిస్తోందా, రోజూ ఇలా ఈ చిట్కాలు పాటిస్తే చాలు

Skin Care Tips: వర్షాకాలం వస్తూనే వివిద రకాల వ్యాధులకు మార్గం సుగమం చేస్తుంది. అందుకే వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్ర్తత్తగా ఉండాలి. ముఖ్యంగా కడుపు సంబంధిత వ్యాధులు తీవ్రమౌతాయి. వర్షాకాలంలో చర్మ సమస్యల్ని కొన్ని చిట్కాలతో నయం చేయవచ్చంటున్నారు. అవేంటో తెలుసుకుందాం..

వర్షాకాలంలో అంతర్గత ఆరోగ్యంతో పాటు బాహ్య ఆరోగ్యం కూడా క్షీణిస్తుంటుంది. కడుపు సంబంధిత సమస్యలు పెరగడం సర్వ సాధారణం. దీనికితోడు ముఖంపై మొటిమలు, స్పోటములు ఏర్పడి అందాన్ని దెబ్బతీస్తాయి. క్రమంగా ముఖంగా గాయాలు, అల్సర్లు ఏర్పడతాయి. సకాలంలో చికిత్స తీసుకోకపోతే అందం దెబ్బతింటుంది. సాధారణంగా చర్మంపై ఏర్పడే మొటిమలు వంటివాటికి వెంటనే చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. వెంటనే చికిత్స చేయించకపోతే ముఖంపై పుండ్లుగా మారిపోతాయి. ఇవి ముఖంపై మచ్చలకు కారణమౌతాయి. మార్కెట్‌లో లభించే రసాయనాలతో నిండిన ఉత్పత్తులు వాడే కంటే ఇంట్లో తయారు చేసుకునే పదార్ధాలతో నయం చేసుకోవచ్చు.

ప్రతి ఇంట్లో తప్పకుండా లభించే శెనగపిండి ఇందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. శెనగపిండిలో పాలు కలిపి ఫేస్ ప్యాక్‌గా ఉపయోగిస్తారు. ఓ చెంచా శెనగపిండిలో కొద్దిగా నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఓ 20 నిమిషాల తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. పసుపుతో కూడా ముఖంపై ఏర్పడే మొటిమలకు చెక్ చెప్పవచ్చు.  అంతేకాకుండా పసుపు వాడటం వల్ల ముఖంపై కాంతి పెరుగుతుంది. ఓ అర చెంచా పసుపుకు ఓ చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నిమిషాల తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.

ఇక ముఖంపై మొటిమల్ని దూరం చేసేందుకు మరో విధానం ముల్తానీ మిట్టీ. ఈ మట్టి ముఖంపై అదనంగా ఉండే నూనెను గ్రహిస్తుంది. ఒకటిన్నర చెంచాల ముల్తానీ మిట్టీలో కొద్దీగా రోజ్ వాటర్ కలిపి మిశ్రంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వారానికి 2 సార్లు పట్టిస్తే మంచి ఫలితాలుంటాయి. ఇక అన్నింటికంటే ముఖ్యమైంది రోజూ తగిన నీళ్లు తాగడం, బాదం, వాల్‌నట్స్ వంటి పోషక పదార్ఘాలు పుష్కలంగా ఉండే డ్రై ఫ్రూట్స్ తినడం. పోషకాలు సమృద్ధిగా ఉంటే ఎలాంటి సమస్య ఉండదు.

Also read: Gastritis Relief: ఎలాంటి ఖర్చు లేకుండా వీటితో పొట్టలో గ్యాస్‌ సమస్యకు 7 నిమిషాల్లో చెక్‌ పెట్టొచ్చు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News