Egg Side Effects: ఉడికించిన కోడిగుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రతి వైద్యుడు సూచిస్తారు. గుడ్డులోని ప్రోటీన్లు శరీరానికి మేలు చేస్తాయి. వేసవి, వర్షాకాలం, చలికాలం అని తేడా లేకుండా ఎప్పుడైనా ఉడికించిన గుడ్డును తినొచ్చని నిపుణులు చెబుతుంటారు. అయితే రోజుకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉందని మీకు తెలుసా? అలా ప్రతిరోజూ ఉడికించిన గుడ్డు తినడం వల్ల డయాబెటిస్ రిస్క్ 60 శాతం పెరుగుతుందని ఓ పరిశోధనలో తేలింది.
పరిశోధనలో బహిర్గతం
చైనా హెల్త్ అండ్ న్యూట్రిషన్ సర్వేలో పాల్గొన్న 8,000 మందికి పైగా గుడ్లు తినే వారిలో శారీరక శ్రమ తక్కువగా ఉంటుందని తేలింది. సీరమ్ కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. శరీరంలో అధిక కొవ్వు, జంతు ప్రొటీన్లు తీసుకున్నట్లు పరిశోధనలో తేలింది.
వీరు అప్రమత్తంగా ఉండాలి!
గుడ్డులోని పచ్చసొనలో ఉండే కోలిన్ ఆక్సీకరణను పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. గుడ్డులోని తెల్లసొనలో ఉండే రసాయనాల నుంచి కార్బోహైడ్రేట్ల శోషణను నిరోధిస్తుంది. అయితే ప్రపంచంలో అనేక మంది ఉడికించిన కోడిగుడ్డును అల్పాహారాల్లో భాగంగా తీసుకుంటున్నారు. గుడ్డులో అధిక ప్రోటీన్లు ఉన్నాయి.
అలా కోడిగుడ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని కొంతమంది వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఒక కోడిగుడ్డులో 200 mg కొలెస్ట్రాల్ ఉంటుంది. కాబట్టి ఇది డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు హానీ కలుగజేస్తుందని అధ్యయనంలో తేలింది.
ఉడికించిన గుడ్లను తినేందుకు ఉత్తమ మార్గం
కోడిగుడ్లను ఉడకబెట్టి.. వాటిపై ఉప్పు, మిరియాలు, కొత్తిమీర ఆకులతో సర్వ్ చేయడం లేదా రెండు గుడ్లను ఉపయోగించి.. ఆఫ్ బాయిల్డ్ లాగా తినడం చాలా శరీరానికి మేలు కలుగుతుంది.
Also Read: Dry Skin vs Kidney Disease: చర్మం పొడిబారుతోందా..లైట్‌గా తీసుకోవద్దు..ఆ వ్యాధి కావచ్చు
Also Read: Betel Leaf Benefits: శోభనం గదిలో పురుషులు తమలపాకులు (పాన్) ఎందుకు తింటారో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.