Summer Drinks For Reduce Bad Cholesterol: వేసవి కాలం పిల్లతో పాటు మీరు కూడా చల్లని ఐస్‌క్రీం, శీతల పానీయాలు తాగుతూ ఉంటారు. అయితే వీటి వల్ల శరీరానికి చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు వీటిని తాగడం వల్ల కొలెస్ట్రాల్ పరిమాణాలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా గుండెపోటు, స్ట్రోక్ ఇతర తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా వేసవిలో తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
వేసవిలో కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి, శరీరాన్ని చల్లబరుచుకోవడానికి తప్పకుండా ఆహారంలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధిక పరిమాణంలో పండ్లతో పాటు కూరగాయాలను ఆహారంలో తీకోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గి కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది.
ఫ్యాట్ గల బాడీని స్లిమ్ చేసుకోవడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన తాజా పండ్లతో తయారు చేసిన జ్యూస్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి రోజు పుచ్చకాయ, సీతాఫలం, నిమ్మకాయ, దోసకాయ, బెండకాయ, మామిడి, నారింజ పండ్ల జ్యూస్‌లను తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పుచ్చకాయ:
ఎండాకాలం మండే ఎండల్లో శీతల పానీయాలను అతిగా తాగుతూ ఉంటారు. అయితే ప్రతి రోజు పుచ్చకాయతో చేసిన గ్రింక్‌ను తాగడం వల్ల శరీరానికి లైకోపీన్ లభిస్తుంది. దీంతో చెడు కొలెస్ట్రాల్ సమస్యలు దూరమవుతాయి. కాబట్టి వేసవిలో కొలెస్ట్రాల్ నియంత్రించుకోవాలనుకునేవారు తప్పకుండా ఈ పుచ్చకాయ డ్రింక్‌ను తాగాల్సి ఉంటుంది.
Also read: Shani Vakri 2023: కుంభరాశిలో రివర్స్‌లో కదలనున్న శని.. ఈ 5 రాశులకు అన్నీ సమస్యలే.
బెండకాయ:
వేసవి కాలంలో బెండకాయ కూడా శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఇందులో విటమిన్ కె, సి, ఎతో పాటు మెగ్నీషియం, ఫోలేట్, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. కాబట్టి బెండకాయతో తయారు చేసిన ఓక్రా వాటర్ తాగడం వల్ల శరీరంలో LDL స్థాయిలను నియంత్రించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కాకరకాయ:
మధుమేహంతో బాధపడుతున్నవారికి కాకరకాయ ఔషధంగా ఉపయోగపడుతుంది. కాకరతో తయారు చేసిన జ్యూస్‌ను ప్రతి రోజూ తాగడం వల్ల కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తాయి.
Also read: Shani Vakri 2023: కుంభరాశిలో రివర్స్‌లో కదలనున్న శని.. ఈ 5 రాశులకు అన్నీ సమస్యలే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook