Sweet Corn Benefits Rainy Season In Telugu: వానకాలం వచ్చిందంటే మనకు గుర్తుకు వచ్చే చిరుదిండ్లలో మొక్కజొన్న ఒకటి. రుచికరంగా ఉండటమే కాకుండా మొక్కజొన్న ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముఖ్యంగా వానకాలంలో మొక్కజొన్నను తినడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఫైబర్ శరీరానికి బోలెడు లాభాలను కలిగిస్తాయి. దీంతో పాటు వానా కాలంలో ఎక్కువగా మొక్కజొన్న తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ శాతం కూడా పూర్తిగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల కూడా రాకుండా ఉంటాయి. ఇవే కాకుండా మొక్కజొన్న తినడం వల్ల ఇతర లాభాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జీర్ణవ్యవస్థకు మేలు:
మొక్కజొన్నలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా పొట్ట నొప్పి రాకుండా కూడా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:
మొక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన రేడికల్స్‌ను తొలగించి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీని కారణంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
గుండె ఆరోగ్యానికి మంచిది:
మొక్కజొన్నలో ఉండే మూలకాలు మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి, చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీని కారణంగా గుండె ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.
రక్తహీనతను తగ్గిస్తుంది:
మొక్కజొన్నలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను తగ్గించి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ముఖ్యంగా గర్భిణి స్త్రీలు తప్పకుండా వీటిని తినడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
క్యాన్సర్ నిరోధకం:
మొక్కజొన్నలోని యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇప్పటికే క్యాన్సర్ వంటి సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా అల్పాహారంలో మొక్క జొన్న తీసుకోవాల్సి ఉంటుంది.
శరీర బరువును తగ్గించడానికి సహాయపడుతుంది:
మొక్కజొన్నలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇది ఎక్కువసేపు మనల్ని తృప్తిగా ఉంచుతుంది. దీని వల్ల మనం అనవసరంగా ఇతర ఆహారాలు తినకుండా ఉంటాము. అలాగే శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.