Increase Hemoglobin: రక్తహీనత సమస్యకు.. తోటకూర లాభాలు ఇవే!

Blood Increasing Foods: సాధార‌ణంగా మనలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు.దీని కారణంగా తీవ్ర అనారోగ్యసమస్యల బారిన పడుతుంటారు. ముఖ్యంగా స్త్రీలల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. రక్తహీనత సమస్య రావడానికి కారణాలు ఏంటి? ఈ సమస్య నుంచి ఎలా బయటపడవచ్చు అనే విషయంపై మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2024, 11:54 AM IST
Increase Hemoglobin: రక్తహీనత సమస్యకు.. తోటకూర లాభాలు ఇవే!

Blood Increasing Foods: ఆరోగ్యనిపుణుల సూచనల ప్రకారం పురుషులల్లో ఐదు లీట‌ర్ల  ర‌క్తం, మహిళల్లో నాలుగున్న‌ర లీట‌ర్ల ర‌క్తం ఉండాలని చెబుతున్నారు. ఒకవేళ రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువ శాతం ఉండే మీరు ఐరన్‌ లోపంతో బాధపడుతున్నారని గ్రహించాలి. రక్తహీత సమస్య ఉన్నప్పుడు వైద్యులు ఐర‌న్ క్యాప్సుల్స్ ని, ఐర‌న్ సిర‌ప్ ని సూచిస్తూ ఉంటారు. అయితే ఎలాంటి మందుల అవసరం లేకుండానే మీరు రక్తహీత సమస్య నుంచి బయట పడవచ్చు. దీని కోసం మీరు ఐర‌న్ అధికంగా లభించే ఆహార పదార్థాలు తీసుకోవడం అవసరం.  అయితే ఐరన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరోగ్యనిపుణుల ప్రకారం మ‌న శ‌రీరానికి రోజుకు 30 మిల్లీ గ్రాముల ఐర‌న్ అవ‌స‌ర‌మ‌వుతుంది. దీని కోసం మీరు ఐర‌న్ ఎక్కువ‌గా  ఉండే ఆకుకూరలు, పండ్లు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఐరన్ ఎక్కువగా లభించే వాటిలో తోటకూర ఒకటి. 100 గ్రాముల తోట‌కూర‌లో 39 మిల్లీ గ్రాముల ఐర‌న్ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబటి రక్తహీనత సమస్య ఉన్నవారు ఈ తోటకూర తీసుకోవడం వల్ల ఎన్నో లభాలు కలుగుతాయి.

Also read: Orange Fruit: కమలా పండు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ సమస్యకు చెక్‌!

తోట‌కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌గినంత సోడియంతో పాటు ఇత‌ర పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. 

తోటకూరను తీసుకోవడం వల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుందని వైద్యులు చెబుతున్నారు. 

తోట‌కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌గినంత ఐర‌న్ ల‌భించ‌డంతో పాటు ఇత‌ర  ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు.ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

అవిసె గింజ‌ల‌ల్లో కూడా అధిక శాతం ఐర‌న్ లభిస్తుంది. 100 గ్రాముల అవిసె గింజ‌లల్లో 100 మిల్లీ గ్రాముల ఐర‌న్ పొందవచ్చు. అవిసె గింజ‌లను వేయించి కారం పొడి త‌యారు చేసి తీసుకోవ‌డం వల్ల శరీరానికి  ఐర‌న్ పొందవచ్చు . ఇలా చేయడం వల్ల రక్తహీనత నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

Also read: Thati Kallu Benefits: డయాబెటిస్ ఉన్నవారు తాటికల్లు తాగుతే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News