Summer Tips: వేడివేడి ఎండలో ఈ ఆహారం అస్సలు తినకండి.. ఇవే తినండి..

Summer Health Tips: ఎండలు దంచికొడుతున్నాయి. ఈ సీజన్లో మనం ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. వడదెబ్బ కొట్టి ప్రాణాంతకంగా కూడా మారుతుంది. ఈ సీజన్లో ముఖ్యంగా కొన్ని ఆహారాలను అస్సలు తినకండి. ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Mar 11, 2024, 06:22 PM IST
Summer Tips: వేడివేడి ఎండలో ఈ ఆహారం అస్సలు తినకండి.. ఇవే తినండి..

Summer Health Tips:  ఎండాకాలం ముఖ్యంగా పిల్లల నుంచి 60 ఏళ్లు ఉన్న పెద్దలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఎండలో తిరగకూడదు. అత్యవసర పరిస్థితుల్లో గొడుగు, టోపీలు లేకుండా బయటికి రాకూడదు. అంతేకాదు వేసవిలో మనం వేసుకునే దుస్తులు కూడా కాటన్ వే ఉండాలి.ముఖ్యంగా సిల్క్, పాలిస్టర్ తో తయారు చేస్తున్న దుస్తులను అసలు వేసుకోకూడదు. ఆ దుస్తులు కూడా వదులుగా ఉండేలా చూసుకోవాలి, టైట్ గా ఉన్నవి అస్సలు ధరించకూడదు. ముఖ్యంగా జీన్స్ ప్యాంట్ ఎండాకాలంలో వేసుకోకపోవడమే మంచిది. ఎండాకాలంలో మనం తినకూడని కొన్ని ఆహారాలు ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం..

ముఖ్యంగా జంక్ ఫుడ్ నూడుల్స్, ఫ్రైడ్ రైస్ వంటివి ఎండాకాలంలో అస్సలు తినకూడదు.  ముఖ్యంగా బేకరీలో తయారు చేసిన పాస్తా, ఐస్ క్రీమ్ వంటి వాటికి దూరంగా ఉండాలి.ఎండాకాలంలో మాంసాహారం తినవచ్చు ముఖ్యంగా చేపలు, రొయ్యలు, బ్రాయిలర్ చికెన్ వంటివి తీసుకోవచ్చు. కానీ ఫ్రై కాకుండా, ఆయిల్ లేకుండా చూసుకోవాలి.అంతేకాదు ఇగురు వంటి కూరల నుంచి దూరంగా ఉండాలి.ఉదయం పూట ఉప్మా రవ్వ, దోశ, పెసరట్టు పొంగలి వంటివి తీసుకోవాలి. ముఖ్యంగా పూరి, వడ, గారెలు వంటి నూనెతో తయారు చేసిన వస్తువులను అసలు తీసుకోకూడదు. లేదంటే పెరుగుతో తయారు చేసినవి తినొచ్చు.

ఇదీ చదవండి: ఉపవాసాల్లో ఎలాంటి డైట్ ఉండాలి, మధుమేహంం వ్యాధిగ్రస్థులు ఏం చేయాలి

వేసవిలో తినాల్సిన ఆహారం..
వేసకాలంలో అత్యధికంగా నీరు ఉండే పదార్థాలను తీసుకోవాలి. ముఖ్యంగా కీరదోసకాయ వాటర్ మిలన్ వంటివి తీసుకోవాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ రాత్రి డిన్నర్ టైం లో కీరదోస ఉండేలా చూసుకోవాలి. మీ డైట్ లో ఉల్లిపాయ, టమాటా కూడా వేసవికాలంలో ఉండేలా చూసుకోవాలి.ఉదయం వెల్లుల్లి రెండు రెబ్బలను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇక ఎండాకాలంలో వచ్చే సీజనల్ ఫ్రూట్ మామిడికాయ ఇంట్లోనే మామిడిపండును పాలతో కలిపి మామిడిపండు రసం తయారు చేసుకోవాలి.

ఇదీ చదవండి: షుగర్ ఉన్నవాళ్లు పరగడుపున బొప్పాయి తింటే ఏమవుతుందో తెలుసా?

పండ్ల విషయానికి వస్తే కమలం, బత్తాయి అంటివి నేరుగా తినొచ్చు లేదా రసం చేసుకొని తాగొచ్చు.ముఖ్యంగా పైనాపిల్ ముక్కలను తీసుకోవాలి ఉదయం పూట రాగిజావ తీసుకుంటే కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. మీరు మీతో పాటు తీసుకెళ్లే వాటర్ బాటిల్ లో సబ్జా గింజలు కొద్దిగా బెల్లం ముక్క వేసుకొని తీసుకువెళ్లాలి. ఎండాకాలంలో కాచి చల్లార్చిన నీళ్లను గంటకొకసారి తాగడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల వేసవిలో ప్రబలే అంటూ వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు. వేసవికాలంలో ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. మజ్జిగను కూడా మీ డైట్లో చేర్చుకోండి. మజ్జిగలో నిమ్మరసం కలిపి తీసుకోవాలి. అయితే, బీపీ సమస్య ఉన్నవారు ఉప్పు లేకుండా మజ్జిగను తాగాలి. డయాబెటిస్ ఉన్నవాళ్లు లస్సి జోలికి పోకూడదు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News