Natural Remedies For Blood Sugar Control: నేటి కాలంలో చిన్న పిల్లలు, యువత, వృద్ధులు అందరూ డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఈ డయాబెటిస్‌కు పూర్తి నివారణ లేదు. కొన్ని మందులను, మూలికలను తీసుకుంటూ నియంత్రించాలి. శరీరంలో బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా ముఖ్యం, కానీ కొంతమంది దీనిని పాటించడంలో నిర్లక్ష్యంగా ఉంటారు. రక్తంలో చక్కెర పెరిగినప్పుడు, అధిక దాహం, పొడిబారడం, తరచుగా మూత్రవిసర్జన, అలసట, బలహీనత, అస్పష్టమైన దృష్టి, దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి. చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే కళ్లు, మూత్రపిండాలు దెబ్బతింటాయి.
కొన్ని ఇంటి నివారణలు షుగర్ లెవెల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. అయితే వాటిని మధుమేహం చికిత్సతో పాటు మాత్రమే ఉపయోగించాలి. కొత్త నివారణను ప్రారంభించే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.
షుగర్ లెవెల్ తగ్గించడానికి కొన్ని ఇంటి నివారణలు:
షుగర్ లెవల్స్‌ను కొంట్రోల్ చేయడంలో నిమ్మరసం ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. దీంతో పాటు కాకరకాయ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీని గింజలను తొలగించి రసం చేసుకొని తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. రాత్రంతా నానబెట్టిన మెంతులను ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి. మెంతుల నీరు ఆరోగ్యానికి మరి కొన్ని అద్భుతైన ఫలితాలను కూడా అందిస్తుంది.
మనం ప్రతిరోజు వంటల్లో ఉపయోగించే పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం ఇన్సులిన్‌ను ప్రభావితంగా పనిచేసేలా సహాయపడుతుంది. వీటితో పాటు కొన్ని పండ్లు ఆకులు కూడా ఈ డయాబెటిస్‌కు ఎంతో మేలు చేస్తాయి. అందులో జామున్ ఆకు ఒకటి. ఇది షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలో ఎంతో మేలు చేస్తుంది. జామున్ జ్యూస్ కూడా మార్కెట్లో లభిస్తుంది.
వీటితో పాటు మీరు మీ జీవనశైలిలో కూడా పలు మార్పులు చేయాల్సి ఉంటుంది. అందులో వ్యాయామం ఒకటి. యోగా, జిమ్ వంటి రెగ్యులర్ పనులను చేయడం వల్ల ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటారు. దీంతో పాటు డయాబెటిస్ కూడా అదుపులో ఉంటుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం చాలా ముఖ్యం. ప్రతిరోజు సమయానికి భోజనం చేయడం, మందులను ఉపయోగించడం చాలా అవసరం.
గమనిక: ఈ రెమెడీలను ఉపయోగించేటప్పుడు, అవి మధుమేహం చికిత్సకు మాత్రమే అని గుర్తుంచుకోండి. డాక్టర్ సలహా తీసుకోండి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి