Star fruit Benefits: స్టార్ ఫ్రూట్ తింటే వచ్చే లాభాలు తెలిస్తే... మీరు ప్రతిరోజూ తింటారు..

Star fruit Health Benefits: స్టార్ ఫ్రూట్  ఈ మధ్యకాలంలో మార్కెట్లలో బాగా కనిపిస్తూనే ఉంది. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది ,అంతే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. స్టార్ ఫ్రూట్ ని మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది.

Written by - Renuka Godugu | Last Updated : May 22, 2024, 03:14 PM IST
Star fruit Benefits: స్టార్ ఫ్రూట్ తింటే వచ్చే లాభాలు తెలిస్తే... మీరు ప్రతిరోజూ తింటారు..

Star fruit Health Benefits: స్టార్ ఫ్రూట్  ఈ మధ్యకాలంలో మార్కెట్లలో బాగా కనిపిస్తూనే ఉంది. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది ,అంతే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. స్టార్ ఫ్రూట్ ని మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మీ డైట్లో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

ఫాస్ఫరస్..
 స్టార్ ఫ్రూట్లో ఎక్కువ శాతం ఫాస్ఫరస్ ఉంటుంది. ఇది మన పళ్ళకి, ఎముక ఆరోగ్యానికి ఎంతో కీలకం స్టార్ ఫ్రూట్ ని రెగ్యులర్ గా డైట్లో చేర్చుకోవడం వల్ల పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకలు కూడా బలంగా పెరుగుతాయి.

కంటి చూపు..
 స్టార్ ఫ్రూట్ లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది ఇది మన కంటి చూపు మెరుగైన కంటి చూపుకు సహాయపడుతుంది.

హైడ్రేటింగ్ గుణాలు..
స్టార్ సూట్ లో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మన రోజంతటికి కావాల్సిన హైడ్రేషన్ అందిస్తుంది దీంతో మన శరీరం చల్లగా ఉంటుంది.

జీర్ణ క్రియ..
 స్టార్ ఫ్రూట్ లో ఎక్కువ శాతం ఫైబర్ ఉంటుంది. ఇది మంచి జీర్ణ క్రియ కు సహకరిస్తుంది. ఏవైనా కడుపు సంబంధిత సమస్యలు ఉంటే నివారిస్తుంది. కడుపు ఉబ్బరం, వాపు, కడుపునొప్పి సమస్యలకు స్టార్ ఫ్రూట్ ఎఫెక్టివ్ రెమిడి.

 గాయాలు తగ్గిస్తుంది..
అధిక మొత్తంలో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది గాయాలు మనిపించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే కాదు డామేజ్ అయిన టిష్యూలను కూడా రిపేర్ చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.

విటమిన్ సి పుష్కలం..
స్టార్ ఫ్రూట్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. అంతేకాదు కొల్లాజెన్ ఉత్పత్తిలో కూడా ప్రేరేపిస్తుంది.

 యాంటీ ఆక్సిడెంట్స్..
 స్టార్ ఫ్రూట్ లో ఎక్కువ మోతాదుల యాంటీ ఆక్సిడెంట్సు పుష్కలంగా ఉంటాయి. మన శరీరంలో వ్యర్థాలను తొలగిస్తుంది. అంతేకాదు సెల్ డామేజ్ కాకుండా రక్షణగా ఉంటుంది.

క్యాలరీలు తక్కువ..
స్టార్ ఫ్రూట్ లో క్యాలరీల మోతాదు కూడా తక్కువగా ఉంటుంది. ఇందులో పోషకాలు ఉంటాయి. ఇది మన బరువు నిర్వహణ కూడా సహకరిస్తుంది.  వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు స్టార్ ఫ్రూట్ ను చేర్చుకోవచ్చు.

కాలేయ ఆరోగ్యం..
స్టార్ ఫ్రూట్ మంచి డిటాక్సిఫైయర్ గుణాలు కలిగి ఉంటుంది. దీని డైట్ లో చేర్చుకోవడం వల్ల లివర్ డిటాక్సిఫై అవుతుంది. లివర్ పనితీరు కూడా మెరుగు పడుతుంది. మొత్తానికి స్టార్ ఫ్రూట్ లివర్ ఆరోగ్యానికి సహాయపడుతుంది.

ఇదీ చదవండి: ప్రతిరోజూ చిటికెడు మిరియాలపొడి నెలరోజులపాటు తీసుకుంటే మీ శరీరంలో జరిగే అద్భుతాలు..

కొలెస్ట్రాల్..
స్టార్ ఫ్రూట్ లు ప్రతిరోజు మన డైట్ లో చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్ కూడా తగ్గిపోతూ ఉంటాయి దీంతో గుండె సంబంధిత సమస్యలు రావు.

చర్మ ఆరోగ్యం..
 స్టార్ ఫ్రూట్ ను స్టార్ ఫ్రూట్ లో పుష్కలంగా జింక్, విటమిన్ ఇ ఉంటుంది. ఇ విటమిన్ అంటే అందానికి పేరు. ఇది స్కిన్ టెక్చర్ మెరుగుపరుస్తుంది. డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది వృద్ధాప్య ఛాయలు రాకుండా నివారిస్తుంది. మీ డైలీ మీల్స్ లో స్టార్ ఫ్రూట్ ను చేర్చుకుంటే మీ ముఖం రెండింతలు మెరుస్తుంది.

ఇదీ చదవండి:  అన్నం వండే ముందు ఇలా చేయండి.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు.. బరువు కూడా..

ఎనర్జీ బూస్ట్..
 స్టార్ ఫ్రూట్లో ఎన్నో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంటే మెగ్నీషియం క్యాల్షియం కార్బోహైడ్రేట్ ఇవి ఎనర్జీ ఉత్పత్తికి మన శరీరానికి సహాయపడతాయి మన త శరీరంలో తక్షణ శక్తి కావాలంటే స్టార్ ఫ్రూట్ ని డైట్ లో చేర్చుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News