Too Much Protein Symptoms: అతిగా ప్రోటీన్స్‌ గల ఆహారాలు తింటున్నారా? ఇది మీ కోసమే!

Too Much Protein Symptoms: హై ప్రోటీన్స్‌ కలిగిన ఆహారాలు ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా చాలా మందిలో జీర్ణక్రియ సమస్యలతో పాటు కాల్షియం లోపం సమస్యలు కూడా వస్తాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 14, 2023, 01:05 PM IST
Too Much Protein Symptoms: అతిగా ప్రోటీన్స్‌ గల ఆహారాలు తింటున్నారా? ఇది మీ కోసమే!

Too Much Protein Symptoms: శరీరానికి అత్యంత అవసరమైన పోషకాల్లో ప్రోటీన్‌ ఒకటి. ఇది శరీరానికి సరైన మోతాదులో అందితేనే మనిషి ఎంతో యాక్టివ్‌గా పని చేస్తాడు. ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో ప్రోటీన్‌ లోపం సమస్యలు వస్తున్నాయి. ఈ లోపం కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొంతమంది ఈ లోపం కారణంగా వచ్చే వ్యాధులను దృష్టిలో పెట్టుకుని ముందుగానే హై ప్రోటీన్స్‌ కలిగిన ఆహారాలను విచ్చలవిడిగా తీసుకుంటున్నారు. ఇలా అధికంగా ప్రోటీన్స్‌ కలిగిన ఆహారాలు ప్రతి రోజు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రోటీన్స్‌ను అతిగా తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ప్రోటీన్స్‌తో పాటు ఈ పోషకాలను కూడా తీసుకోవాలి:
అధిక ప్రోటీన్ ఆహారంతో పాటు.. ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు , పిండి పదార్థాలు అధిక పరిమాణాల్లో లాభించే ఆహారాలు కూడా ప్రతి రోజు తీసుకోవడం శరీరానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటికి బదులుగా కేవలం ప్రోటీన్స్‌ కలిగిన ఆహారాలు మాత్రమే తీసుకుంటే డీహైడ్రేషన్‌ సమస్యలు వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు చాలా మందిలో జీర్ణక్రియ సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి అతిగా ప్రోటీన్స్‌ కలిగిన ఆహారాలు తినకూడదు. 

డీహైడ్రేషన్:
అతిగా ప్రోటీన్స్‌ కలిగిన ఆహారాలు తీసుకోవడం వల్ల మూత్రం ద్వారా శరీరంలోని నీరు బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని కారణంగా కొంతమందిలో డీహైడ్రేషన్‌, భయం వంటి సమస్యలు కూడా రావచ్చు. 

కాల్షియం లోపం:
ప్రొటీన్లు అతిగా ఉండే ఆహారాలు అతిగా తీసుకునేవారిలో సులభంగా కాల్షియం లోపం వంటి సమస్యలు కూడా వస్తాయి. దీని కారణంగా ఎముకలు బలహీనంగా మారుతాయి. అంతేకాకుండా శరీరం దృఢత్వ కోల్పోయే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

కిడ్నీలు బలహీనపడటం:
ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలపై ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా తీవ్ర కిడ్నీ సమస్యలు కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇప్పటికే కిడ్నీ సమస్యలతో బాధపడేవారు ప్రోటీన్స్‌ అధికండా ఉండే ఆహారాలను తినకపోవడం చాలా మంచిది.

జీర్ణక్రియ సమస్యలు:
ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు ప్రతి రోజు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా కొంతమందిలో  వాంతులు, విరేచనాలు, మలబద్ధకం వస్తాయి. 

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News