Hair Care Tips: జుట్టు సమస్యలకు ఇలా చెక్ పెట్టండి.. ఈ టిప్స్ పాటిస్తే మరింత యవ్వనంగా..!

Hair Care Tips Home Remedies: చలికాలంలో చర్మ సమస్యలతో పాటు జుట్టు కూడా ఎక్కువగా రాలిపోయ అవకాశం ఉంటుంది. చాలామంది చుండ్రు సమస్యలతో ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటారు. మీ ఆహారంలో విటిమన్ ఈ ఎక్కువగా ఉండేలా చూసుకుంటే జుట్టు సమస్యలకు చెక్ పెట్టొచ్చు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 5, 2023, 05:14 PM IST
Hair Care Tips: జుట్టు సమస్యలకు ఇలా చెక్ పెట్టండి.. ఈ టిప్స్ పాటిస్తే మరింత యవ్వనంగా..!

Hair Care Tips Home Remedies: చలికాలం మొదలైంది. చలితోపాటు ప్రస్తుతం భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. ఈ సమయంలో చర్మం, జుట్టు సంబంధిత సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సీజన్‌లో హెయిర్ ఫాల్‌, చుండ్రు సమస్యలు ఎక్కువగా వస్తాయి. అందుకే చలికాలంలో జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డైటీషియన్‌, న్యూట్రిషనిస్ట్‌  ఒజీవా హెయిర్‌ కేర్‌ పమస్యలకు కొన్ని చిట్కాలను అందించారు. ఈ సీజన్‌లో హెయిర్‌ సమస్యలకు చెక్ పెట్టాలంటే విటమిన్ ఈ ను మీ హెయిర్‌ కేర్‌ రొటీన్లో చేర్చుకోవాలని చెబుతున్నారు. చలికాలంలో హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా విటమిన్ ఈ లేమి అధికంగా ఉంటుంది. దీంతో జుట్టు రాలిపోయే అవకాశం ఉంటుంది.

హెయిర్ బూస్టర్‌..

విటమిన్ ఈ లో హెయిర్ బూస్టింగ్‌ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలను పెరగడానికి ప్రోత్సహిస్తుంది. సెల్‌ డ్యామెజ్‌ కాకుండా ఆక్సిడెటివ్‌ స్ట్రెస్‌, ఫ్రీ రాడికల్స్ సమస్యలను నివారిస్తుంది.

ఈ ఫుడ్స్‌ తింటే..

కొన్ని రకాల సీడ్స్‌ అంటే హేజల్‌ నట్‌, పల్లీలు, పైన్ నట్స్, బాదం, సన్ ఫ్లవర్‌ ఆయిల్, పాలకూర, కాలే, మామిడికాయ, బొప్పాయి, కీవీ విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. అదనంగా బ్రౌన్ రైస్‌ను కూడా మీ డైట్లో చేర్చుకుంటే మీ శరీరానికి తగినంత విటమిన్ ఈ అందుతుంది.

విటమన్‌ ఈ సప్లిమెంట్స్‌..

విటమిన్ ఈని మీ డైట్లో సప్లిమెంట్లో రూపంలో కూడా చేర్చుకోవచ్చు. దీనికి ముందుగా నిపుణుల సలహా తీసుకోవాలి. ప్లాంట్ బేస్డ్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ చర్మాన్ని, జుట్టును మృదువుగా చేస్తాయి. ఇవి సింథటిక్ కంటే రెండింతలు గ్రహించే శక్తి కలిగి ఉంటుంది. ఆర్గాన్ ఆయిల్, అలోవెరా, సన్ ఫ్లవర్‌లో కూడా విటమిన్ ఈ ఉంటుంది. అంతేకాదు ఈ ప్లాంట్ బేస్డ్ ఫెస్ వాష్, సీరం, నైట్ జెల్ వాడటం వల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. విటమిన్ ఈ చుండ్రు సమస్యలకు చెక్ పెట్టడమే కాకుండా తలలో మెరుగైన రక్త ప్రసరణకు తోడ్పడుతుంది. ప్లాంట్ బేస్డ్ సప్లిమెంట్ల వల్ల చర్మానికి అదనపు రక్షణగా ప్రోత్సహిస్తుంది.

Also Read: Abhiram Daggubati: దగ్గుబాటి అభిరామ్ పెళ్లి.. సురేష్ బాబు ఇంట మొదలైన సంబరాలు

Also Read: Vivo T2 Pro 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో బొనాంజా సేల్‌..Vivo T2 Pro 5Gపై రూ.22,550 వరకు ఎక్చేంజ్‌ బోనస్‌..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News