Uric Acid Problem: యూరిక్ యాసిడ్ సమస్యకు చెక్ పెట్టాలంటే ఈ జ్యూస్ రోజూ తాగాల్సిందే

Uric Acid Problem: మనిషి జీవితంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చాలా అవసరం. శరీరంలో జరిగే అంతర్గత మార్పులు వివిధ రూపాల్లో బయటపడుతుంటాయి. ఇందులో అత్యంత ముఖ్యమైంది యూరిక్ యాసిడ్ సమస్య. ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 28, 2023, 05:35 PM IST
Uric Acid Problem: యూరిక్ యాసిడ్ సమస్యకు చెక్ పెట్టాలంటే ఈ జ్యూస్ రోజూ తాగాల్సిందే

Uric Acid Problem: ఇటీవలి కాలంలో యూరిక్ యాసిడ్ సమస్య తీవ్రమౌతోంది. అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా యూరిక్ యాసిడ్ సమస్య ఉత్పన్నమౌతుంది. అందుకే ఆహారపు అలవాట్లను మెరుగుపర్చుకోవాలి. యూరిక్ యాసిడ్ తగ్గించేందుకు ఏం చేయాలనేది తెలుసుకుందాం..

యూరిక్ యాసిడ్ సమస్య ఇటీవలి కాలంలో సర్వ సాధారణమైంది. ఆధునిక పోటీ ప్రపంచంలో చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఎదురయ్యే అనారోగ్యాల్లో ఇదొకటి. యూరిక్ యాసిడ్ అనేది ఓ రకమైన శారీరక వ్యర్ధం. ఈ వ్యర్ధాల వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమౌతాయి. మీ ఆహారపు అలవాట్లు కాస్త మార్చుకుంటే లేదా హెల్తీ ఫుడ్స్ తీసుకుంటే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. యూరిక్ యాసిడ్ కారణంగా తలెత్తే సమస్యల్లో నొప్పి, నడిచేటప్పుడు ఇబ్బందులనేవి సాధారణంగా కన్పిస్తాయి. 

యూరిక్ యాసిడ్ సమస్య నుంచి ఉపశమన పొందాలంటే విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్ వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్ధాలు తప్పకుండా తీసుకోవాలి. దీనికోసం ఆనపకాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఆనపకాయ జ్యూస్ తాగడం వల్ల యూరిక్ యాసిడం నియత్రణలో ఉంచుకోవచ్చు. ఓ చిన్న ఆనపకాయ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కల్ని మిక్సీలో గ్రైండ్ చేసుకుని రోజూ ఉదయం వేళ కొద్దిగా బ్లాక్ సాల్ట్ కలుపుకుని తాగితే మంచి ఫలితాలుంటాయి. యుూరిక్ యాసిడ్ సమస్య తగ్గితే జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి.

బరువు తగ్గించడం అనేది ఇటీవలి కాలంలో ప్రధాన సమస్యగా మారింది. చాలామంది ఎన్నో రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు.  ఆనపకాయ జ్యూస్ సేవిస్తే పొట్ట, నడుము చుట్టూ ఉండే కొవ్వు దూరమౌతుంది. ఎందుకంటే ఇందులో పోషకాలు ఎక్కువగా ఉండి కేలరీలు తక్కువగా ఉంటాయి.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం మంచిది కాదు. కొలెస్ట్రాల్ కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా అధిక రక్తపోటు, హార్ట్ ఎటాక్, కొరోనరీ ఆర్టరీ డిసీజ్, ట్రిపుల్ వెసెల్ డిసీజ్ వంటి సమస్యల ముప్పు వెంటాడుతుంది. ఆనపకాయ జ్యూస్ రోజూ క్రమం తప్పకుండా తాగడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

డయాబెటిస్ రోగులకు ఆనపకాయ జ్యూస్ అద్భుతమైన ఔషధం కంటే తక్కువ కాదు. రోజూ తాగే అలవాటుంటే యూరిక్ యాసిడ్ సమస్య క్రమంగా తగ్గుతుంది. యూరిక్ యాసిడ్ సమస్య తగ్గడమే కాకుండా డయాబెటిస్ కూడా నియంత్రణలో ఉంటుంది.

Also read: Monsoon Health Tips: తరచుగా వానా కాలంలో ఫ్లూల బారిన పడుతున్నారా? ఈ 5 చిప్స్‌ పాటించండి చాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News