Vitamin d Deficiency: విటమిన్ డి లోపం ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి.. జాగ్రత్త సుమా!

Vitamin d Deficiency: ప్రస్తుతం చాలా మంది విటమిన్ డి లోపం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2023, 01:04 PM IST
Vitamin d Deficiency: విటమిన్ డి లోపం ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి.. జాగ్రత్త సుమా!

Vitamin d Deficiency: విటమిన్ డి మన శరీరానికి చాలా ముఖ్యమైనది. అయితే ప్రస్తుతం చాలా మంది విటమిన్‌ డి లోపం సమస్యలతో బాధపడుతున్నారు. దీని కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడడమేకాకుండా శరీర అందాన్ని కోల్పోతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే తప్పకుండా ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే శరీరానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

విటమిన్ డి లోపం వల్ల కలిగే నష్టాలు:

రోగనిరోధక శక్తి:
శరీరంలో తగిన పరిమాణంలో విటమిన్ డి లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని లోపం ఉంటే శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోయి.. దగ్గు, జలుబుతో సహా అనేక వైరల్ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

అలసట:
అలసట రావడానికి ప్రధాన కారణాలు విటమిన్ డి లోపం వల్లేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే తరచుగా అలసట వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కాబటట్టి తరచుగా అలసట, ఎముకల సమస్యలతో బాధపడేవారు విటమిన్ డి అతిగా ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.

కీళ్ల నొప్పులు:
విటమిన్ డి లోపం ఉంటే కొందరిలో కీళ్ల నొప్పులకు కూడా దారి తీసే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికే కీళ్ల నొప్పులున్నవారిలో తీవ్ర నొప్పులకు దారి తీసే ఛాన్స్‌ కూడా ఉంది.  కాబట్టి ఉదయాన్నే శరీరాన్ని సూర్యరశ్మి పడేటట్లు  ఉంచాల్సి ఉంటుంది. అంతేకాకుండా డి విటమిన్‌ అధికంగా ఉండే ఆహారాలను కూడా ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.

డిప్రెషన్:
విటమిన్ డి లోపం వల్ల మానసిక సమస్యలు వచ్చే ఛాన్స్‌ కూడా ఉందని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. చాలా మందిలో డి విటమిన్‌ ఉన్నవారిలో మానసిన సమస్యలు వచ్చాయని ఇటీవలే పలు పరిశోధనలలో తేలింది. కాబట్టి తప్పకుండా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ విటమిన్స్‌ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణల, సాధారణ నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS ఈ నివారణలను నిర్ధారించలేదు.)

Also Read: Tax Saving Schemes 2023: ఈ పథకంలో పెట్టుబడి పెట్టండి.. ఆదాయంతోపాటు సూపర్ బెనిఫిట్స్  

Also Read: Shubman Gill: ఉప్పల్‌లో పరుగుల ఉప్పెన.. చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News