Vitamins For Eyesight: మనలో చాలా మంది కళ్ల ఆరోగ్యంపట్ల నిర్లక్ష్యం చేస్తుంటారు. దీని వల్ల కంటి సంబంధిత సమస్యల బారిన పడుతుంటారు. అంతేకాకుండా కళ్లు మండడం, కళ్లు పొడిబారడం, కంటి నుండి నీరు కారడం, రేచీకటి వంటి అనేక రకాల కంటి సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండాలి అంటే ఆరోగ్యానికి మేలు కలిగించే ఆహారపదార్థాలు తీసుకోవాలి. అయితే ముఖ్యంగా ఆరు రకాల విటమిన్స్‌ను తీసుకోవాలి. అయితే ఎలాంటి విటమిన్స్ తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
→ విటమిన్ ఎ: కంటిచూపును మెరుగుపరచడవలో విటమిన్ ఎ చాలా అవసరం. దీనిని తీసుకోవడం వల్ల రెటీనాలో రోడాప్సి ఉత్పత్తిని పెంచి కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.విటమిన్ ఎ చీజ్, చేపలు, పాలు, పెరుగు వంటి ఆహార పదార్థాల్లో దొరుకుతుంది.
→ విటమిన్ సి: కంటి ఆరోగ్యాన్ని పెంచడంలో విటమిన్ సి కీలక పాత్రను పోషిస్తుంది. దీని తీసుకోవడం వల్ల వయసుపైబడిన తర్వత వచ్చే కంటి సమస్యలు రాకుండా చేస్తుంది. విటమిన్ సి అనేది ఆరెంజ్, స్ట్రాబెర్రీ, బ్లాక్ బెర్రిలో అధికంగా లభిస్తుంది.
→ విటమిన్ ఇ: కంటిపొరలు, మ్యాక్యులర్ డిజెనరేషన్ వంటి కంటి సమస్యలు రాకుండా చేయడంలో విటమిన్ ఇ సహాయపడుతుంది.విటమిన్ ఇ చియా విత్తనాలు, పొద్దుతిరుగుడు గింజలు, బాంపప్పు వంటిలో ఎక్కవగా దొరుకుతుంది.
→ విటమిన్ కె: కంటికి రక్తాన్ని సరఫరా చేయడంలో విటమిన్ కె ఎంతో సహాయపడుతుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో విటమిన్ కె ఎంతో మేలు చేస్తుంది. విటమిన్ కె అనేది పాలకూర, తోటకూర, చుక్కకూర వంటి ఆకుకూరలల్లో ఎక్కువగా లభిస్తుంది.
Also read: Thati Kallu Benefits: డయాబెటిస్ ఉన్నవారు తాటికల్లు తాగుతే?
→ ఒమెగా 3: కళ్ళకు తగినంత తేమను అందించడంలో ఒమెగా ౩ ఫ్యాటీ యాసిడ్లు సహాయపడుతాయి. కంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఈ ఒమెగా ౩ తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. ఇది ఎక్కువగా సాల్మన్ చేపలు, గుడ్లు,ట్యూనా చేపల వంటి ఆహార పదార్థాల్లో దొరుకుతుంది.
→ విటమిన్ బి 12: విటమిన్ బి 12 తీసుకోవడం వల్ల కంటిచూపు మందగించకుండా కపాడుతుంది. విటమిన్ బి12 అనేది గుడ్లు, పాలు, మాంసం వంటి వాటిలో అధికంగా లభిస్తుంది.
ఈ విటమిన్లు తప్పకుండా తీసుకోవడం వల్ల కళ్ళకు వచ్చే అనేక సమస్యలను రాకుండా చేస్తుంది. వీటిని ప్రతిరోజు మీ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Also read: Orange Fruit: కమలా పండు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ సమస్యకు చెక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter