Weight Gain In 2 Days: చాలా మంది ఉపవాస రోజుల్లో సాబుదానాని ఎక్కువగా తీసుకుంటారు. కానీ వీటిని సాధరణ రోజుల్లో అస్సలు తీసుకోరు. అయితే ఇందులో చాలా రకాల పోషక విలువలు ఉండడం వల్ల శరీరానికి కావాల్సి అన్ని రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. సాబుదానా తేలికగా జీర్ణమయ్యే ఆహారం. కావును ఇది జీర్ణ క్రియను బలంగా చేస్తుంది. అయితే శరీర తక్కువ బరువుతో బాధపడుతున్నవారు తప్పకుండా వీటితో చేసి ఆహార పదార్థాలను ట్రై చేయాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు బరువును పెంచడాకి ఉపయోగపడుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సబుదానాలోని ఉండే పోషకాలు ఇవే:
సబుదానాలో అధికంగా కార్బోహైడ్రేట్ ఉంటాయి. దీనితో పాటు ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. కాల్షియం, ఫైబర్, ఐరన్ తక్కువ మొత్తంలో లభిస్తాయి.
ప్రోటీన్స్: 0.2 గ్రాములు
కొవ్వులు: 0.2 గ్రాములు
కార్బోహైడ్రేట్లు: 87 గ్రాములు
శక్తి: 351
సబుదానలో కార్బోహైడ్రేట్లు అధిక పరిమాణంలో.. పీచుపదార్థాలు తక్కువగానూ ఉంటాయి. అందువల్ల బరువు పెరగడానికి దోహదపడుతాయి. సబుదానాలో అధిక మొత్తంలో స్టార్చ్ కూడా ఉంటుంది. ఇది శరీరాన్ని దృఢంగా చేసి.. బరువును పెరగడానికి సహాయపడుతుంది.
బరువు పెరగడానికి సాబుదానా ఎలా తినాలి:
1. సబుదానా ఖీర్:
చాలా మందికి సబుదానా ఖీర్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసు. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని దృఢంగా చేసి.. బరువును పెంచుతుంది. దీని కోసం సాబుదానాను కొన్ని గంటలు నానబెట్టి.. పాలు వేడి చేసి, అందుంలో సాబుదానా వేసి మరిగించాలి. ఆ తర్వాత బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి సర్వ్ చేసుకోవచ్చు.
2. సబుదానా ఖిచ్డీ:
బరువు పెరగడానికి సాబుదానా ఖిచ్డీని కూడా తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో అధిక పరిమాణంలో పోషకాలు ఉండడం వల్ల శరీర బరువును పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. బరువు పెరగాలనుకునే వారు తప్పకుండా సబుదానా ఖిచ్డీ ఆహారంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
3. సబుదానా సూప్:
అన్ని సూప్‌లు శరీరానికి మంచివి కాదు. అయితే సబుదానా సూప్ మాత్రం తప్పకుండా తీసుకోవాలి. ఇందులో చాలా రకాల పోషకాలు, అధిక పరిమాణంలో విటమిన్లు ఉంటాయి. కావున శరీరాన్ని బలంగా చేస్తాయి. ముఖ్యంగా బరువు పెరగడానికి సహాయపడుతుంది. వానాత కాలంలో వచ్చే వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
Also Read: Disadvantages Of Salad: పుట్టగొడుగు, క్యాబేజీ, బ్రోకలీలను ఉడికించకుండా తింటే ఏం జరుగుతుందో తెలుసా..!
Also Read: Weight Loss Home Remedy: పాలలో తేనె కలుపుకుని తాగితే.. ఐదు రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..!
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.