Weight Loss tips: ఈ వెజిటబుల్ సూప్స్ ట్రై చేస్తే వారాల్లోనే అధిక బరువు, బెల్లీ ఫ్యాట్‌కు చెక్

Weight Loss tips: ఆధునిక జీవన విధానంలో అధిక బరువు ప్రధాన సమస్యగా మారుతోంది. బరువు తగ్గించుకునేందుకు చాలామంది చాలారకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు సఫలమైతే కొందరు విఫలమౌతుంటారు. ఒక సింపుల్ వెజిటబుల్ సూప్ ద్వారా బరువు ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 22, 2023, 07:56 PM IST
 Weight Loss tips: ఈ వెజిటబుల్ సూప్స్ ట్రై చేస్తే వారాల్లోనే అధిక బరువు, బెల్లీ ఫ్యాట్‌కు చెక్

Weight Loss tips: ప్రస్తుత పోటీ ప్రపంచంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి, పని ఒత్తిడి కారణాలతో బరువు పెరగడం ఓ సమస్యగా మారింది. వ్యాయామం, డైట్ కంట్రోల్ ఇలా చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ వెజిటబుల్ సూప్‌తో వారాల వ్యవధిలోనే అధిక బరువు సమస్యకు చెక్ చెప్పేయవచ్చు.

వెజిటబుల్ సూప్ అనేది ఆరోగ్యానికి చాలా లాభదాయకం. బరువు తగ్గించడమే కాకుండా కడుపు, నడుము చుట్టూ పేరుకుపోయే బెల్లీ ఫ్యాట్ సమస్యను కూడా పోగొడుతుంది. దీనికోసం కొన్ని రకాల వెజిటబుల్ సూప్స్ ఊహించని లాభాల్ని అందిస్తాయి. వెజిటబుల్ సూప్ తాగడం వల్ల ముందుగా శరీరం జీర్ణక్రియ మెరుగుపడుతుంది. భోజనం కంటే ముందు ఈ సూప్ తాగితే జీర్ణం సులభమై..బరువు సులభంగా తగ్గుతుంది. అదే సమయంలో బెల్లీ ఫ్యాట్ కూడా మాయమవుతుంది. 

బీట్‌రూట్ సూప్

బీట్‌రూట్ సూప్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ సూప్ చేయడం కూడా చాలా సులభమే. కుక్కర్‌లో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తురవాత అందులో ఉల్లిపాయు, టొమాటో, బీట్‌రూట్ ముక్కలు వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. ఆ తరువాత కుక్కర్ క్లోజ్ చేసి2-3 విజిల్స్ రానివ్వాలి. చల్లారిన తరువాత బాగా కలిపాలి. గిన్నెలో వేసుకుని కొద్దిగా సాల్ట్, మిరియాల పౌడర్ కలుపుకుని సేవించడమే. 

కాలిఫ్లవర్ సూపర్

కాలిఫ్లవర్ సూపర్‌తో ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయి. ఈ సూప్ చేసేందుకు ముందుగా ఒక ప్యాన్‌లో నూనె వేసి వేడెక్కిన తరువాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కాలిఫ్లవర్  వేసి వండాలి. ఆ తరువాత ఇందులో కొద్దిగా నీరు పోసి ఉడకనివ్వాలి. అంతే సూప్ రెడీ అయినట్టే. సర్వ్ చేసే ముందు కొద్దిగా సాల్ట్, కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేయవచ్చు. మంచి రుచి వస్తుంది. 

ఆనపకాయ సూప్

ఆనపకాయ రుచికరమైందే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది. ఆనపకాయ సూప్ చేసేందుకు ముందుగా ఒక ప్యాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తరువాత అందులో ఉల్లిపాయలు, టొమాటో వేసి ఫ్రై చేయాలి. ఆ తరువాత అందులో కట్ చేసిన ఆనపకాయ ముక్కులు వేసి నీళ్లు పోసీ కాస్సేపు వండాలి. ఇందులో ఉప్పు, మిరియాల పౌడర్ కలపాలి. ఇప్పుడు సూప్ చల్లారిన తరువాత బాగా బ్లెండ్ చేసి కొద్దిగా నిమ్మరసం కలిపి సేవించాలి.

ఈ మూడు రకాల సూప్స్ రోజూ క్రమం తప్పకుండా లేదా రోజు విడిచి రోజు సేవిస్తే వారాల వ్యవధిలోనే మీ బరువు తగ్గడమే కాకుండా బెల్లీ ఫ్యాట్ మాయమౌతుంది. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉంటారు. తక్షణం ఇప్పుడే ప్రారంభించండి మరి. ఈ సూప్స్ తాగడం వల్ల చాలా రకాల వ్యాధులు కూడా దరిచేరకుండా ఉండాయి. శరీరంలో ఐరన్, కాల్షియం, విటమిన్ సి వంటి పోషకాలు సమృద్ధిగా అందుతాయి.

Also read: Diabetes Fruits: ఏమాత్రం భయం లేకుండా నిస్సంకోచంగా మదుమేహ వ్యాధిగ్రస్థులు తినగలిగే పండ్లు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News