Benefits Of Water Kept In Copper Vessel: మన పురాతన కాలం నుంచి పెద్దలు మానసికంగా, శరీరకంగా ఉండేందుకు ఎన్నో రకాల సూచనలు చెప్పారు. అందులో చాలా వరకు మనం నిత్య జీవితంలో పాటిస్తున్నాము. ఇటివలే కాలంలో చాలా మంది రాగి పాత్రలను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ రాగి పాత్రలను ఉపయోగించడం వల్ల మానవులకు ఎలాంటి హానికరమైన రోగాలు రాకుండా ఉంటాయని నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ రాగి పాత్రలను ఉపయోగించి వంటలను వండుతున్నారు. ఈ రాగి పాత్రల్లో వండడం వల్ల మంచి రుచి పాటు... రుచితో పాటు ఆరోగ్యం రెండు రకాల ఉపయోగాలు ఉండడంతో గతంలో కంటే ఇప్పుడు చాలా వినియోగిస్తున్నారు.
రాగి పాత్రలో నీరు ఎంతో మేలు..
ప్రస్తుతం చాలా మంది రాత్రంతా నీటిని రాగి పాత్రల్లో నిల్వ ఉంచుకొని ఉదయాన్నే తాగుతున్నారు. ఎందుకిలా తాగుతున్నారని చాలా మందిలో ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. అయితే రాత్రి రాగి పాత్రల్లో నీటిని నిల్వ ఉంచి ఉదయాన్నే తాగితే ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద నిపుణులు, పూర్వికులు చెబుతున్నారు. ఇవి మానవ శరీరంలో కఫ, వాత, పిత్త దోషాలను సమానంగా చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆయుర్వేద శాస్త్రం శాస్త్రం.
ప్రస్తుతం మానవుల్లో సోకే వ్యాధులన్ని ఎక్కువగా నీటీ నుంచే వస్తుంటాయి. నీటిని రాగి పాత్రలో లేదా చెంబులో నిల్వ ఉంచి తాగితే ఆరోగ్య ప్రయోజనాలతో పాటు.. శరీర రోగ నిరోధక వ్యవస్థ కూడా పెరుగుతుంది ప్రస్తుతం ఉన్న కాలంలో తప్పకుండా రాగి పాత్రలను ఉపయోగించాలని నిప్పులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం నీటి ద్వారా రోగాల భారినపడకుండా వాటర్ ఫిల్టర్లు, ఆర్వో ఫ్యూరిఫయర్లు వాడుతున్నారు.. ఈ అంశం పై పరిశోధనల్లో తాజాగా ఆశ్చర్య పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వాటర్ ఫిల్టర్లు, ఆర్వో ఫ్యూరిఫయర్లు కంటే రాగి పాత్రల్లో నీటిని నిల్వ చేస్తే సహజంగానే శుద్ధి అవుతుంది. పాత్రలో నీరంతా సూక్ష్మజీవులు నాశనం అవుతాయి. అందుకోసమే మన పూర్వీకులు మాత్రం రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీటిని మాత్రమే తాగేవారట..
రాగి పాత్రలో నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
# కడుపులో మంట తగ్గడం, అల్సర్లు తగ్గడానికి, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవడం ఈ నీరు కృషి చేస్తుంది.
#కాలేయం, కిడ్నీల పనితీరు మెరుగు పరుస్తాయి, పోషకాలు శరీరానికి అందించే దిశగా పని చేస్తాయి.
#వేగంగా బరువు తగ్గిస్తుంది.
# శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిస్తుంది.
#జీర్ణక్రియ పనితీరును మెరగుపడటానికి ఉపకరిస్తుంది.
#గాయాలు త్వరగా మానడానికి కూడా ఇది ఉపకరిస్తుంది.
#రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
# కొత్త కణాల ఉత్పత్తికి దోహదం చేస్తుంది.
#కడుపులో ఏర్పడిన పుండ్లను మాన్పడానికి సహకరిస్తుంది.
#వృద్ధాప్యం త్వరగా రాకుండా కాపాడుతుంది.
#గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహకరిస్తుంది.
#రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి ఉపకరిస్తుంది.
#క్యాన్సర్ వచ్చే ముప్పును కూడా ఇది తగ్గిస్తుంది.
#థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగపడుతుంది.
Also Read: Skincare in Summer: వేసవిలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి!
Also Read: WhatsApp: వాట్సాప్‌లో క్రేజీ అప్డేట్- 32 మందితో గ్రూప్ వీడియో కాల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook