Acid Reflux Symptoms: ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ కారణంగా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్యలకు కారణం మారిన ఆహార అలవాట్లు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే కామన్‌గా ఎదుర్కొంటున్న జీర్ణ సమస్యలల్లో యాసిడ్ రిఫ్లెక్స్ ఒకటి. యాసిడ్ రిఫ్లెక్స్ అనేది జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధి. ఈ సమస్య కారణంగా కడుపులోని ఆమ్లం అనేది గొంతులోకి వస్తుంది. దీని కారణంగా ఇతర తీవ్ర సమస్యలు కూడా తలెత్తుతాయి. అయితే దీని వల్ల వచ్చే సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
యాసిడ్ రిఫ్లెక్స్ కారణంగా ఛాతిలో నొప్పి, మంట, గుండె నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతో పాటు నోట్లో ఎక్కువగా సలైవా తయారవుతుంది. ఈ సమస్యను ఎలా గుర్తించాలంటే.. మీరు తీసుకున్న ఆహారం తరువాత వెంటనే నోట్లో సలైవ తయారైతే అది యాసిడ్ రిఫ్లెక్స్ కి మొదట్టి దశ అని భావించాలి. గొంతులో మంట వల్ల సలైవ ఎక్కవగా తయారవుతుంది. ఈ జరగడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా నోట్లో ఎప్పుడు చేదుగా, పుల్లగా అనిపిస్తుంది. పుల్లటి త్రేన్పులు వస్తూ ఉంటాయి.
యాసిడ్ రిఫ్లెక్స్ సమస్య కారణంగా కడుపులో అధికంగా యాసిడ్ తయారవుతుంది. దీని వల్ల కడుపు నొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్య కారణంగా పొట్ట ఉబ్బరంగా, అజీర్తి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను ప్రదించాల్సి ఉంటుంది. యాసిడ్ రిఫ్లెక్స్ సమస్య ఉన్నపుడు తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి.
Also Read: Tear Gas Attack: లోక్‌సభలో దుండగులు, టియర్ గ్యాస్‌తో దాడి
ఫైబర్ అధికంగా ఉండే ఆహారం: పీచు అధికంగా లభించే ఆహార పదార్ధాల కారణంగా యాసిడ్ రిఫ్లైక్స్‌ను అదుపు చేయవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫైబర్ కలిగిన ఆహారం తీసుకోవడం కారణంగా జీర్ణక్రియ సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్: మీ రోజు వారి డైట్ లో తప్పకుండా పచ్చని కూరగాయలు, యాపిల్స్, అరటిపండ్లు ఎక్కువగా తీసుకోవాలి. దీని కారణంగా యాసిడ్ రిఫ్లెక్స్ సమస్య కొంతలో సద్దుమణుగుతుంది.
మెడిసిన్స్: యాసిడ్ రిఫ్లక్స్ సమస్యతో బాధపడుతున్న వారు వైద్యం కూడా తీసుకోవచ్చు. దీనికి సంబంధించి అనేక వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
Also Read: Police Officer Sucess Story: పోలీస్ ఉద్యోగానికి రాజీనామా..తెల్లచెందనం పంటతో కోట్లకు కోట్లు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి