Monsoon Precautions: వర్షాకాలంలో..కూరగాయలు, ఆకుకూరల తినడం క్షేమమేనా, వెజ్ సలాడ్ తినవచ్చా

Monsoon Precautions: వర్షకాలం వచ్చేస్తోంది. ఇక నుంచి వివిధ రకాల అనారోగ్య సమస్యల్నించి రక్షించుకోవాలి. ముఖ్యంగా కూరగాయలు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే..చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 25, 2022, 11:42 PM IST
Monsoon Precautions: వర్షాకాలంలో..కూరగాయలు, ఆకుకూరల తినడం క్షేమమేనా, వెజ్ సలాడ్ తినవచ్చా

Monsoon Precautions: వర్షకాలం వచ్చేస్తోంది. ఇక నుంచి వివిధ రకాల అనారోగ్య సమస్యల్నించి రక్షించుకోవాలి. ముఖ్యంగా కూరగాయలు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే..చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. 

మరో వారం రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. సాధారణంగా వర్షాకాలమంటేనే రోగాలకు అనువైన కాలమని చెబుతారు. ఈ నేపధ్యంలో వాతావరణ మార్పు నేపధ్యంలో ఆరోగ్యంపై ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. లేకపోతే పలు రోగాలు, అంటువ్యాధులు విస్తరించవచ్చు.

వర్షాకాలంలో కూరగాయలపై ప్రత్యేక దృష్టి

మండుతున్న ఎండల్నించి వర్షాకాలం ఉపశమనం కల్గిస్తుంది. అదే సమయంలో ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురు కావచ్చు. అందుకే వర్షాకాలంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి వర్షాకాలంలో మనం తినే వస్తువులపై దృష్టి పెట్టాలి. పచ్చని ఆకుకూరలు ఆరోగ్యానికి ఎప్పుడూ మంచివే. కానీ వండేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రయోజనం కంటే నష్టాలు ఎదురుకావచ్చు. ఎందుకంటే వర్షాకాలంలో కూరగాయలు, ఆకుకూరల విషయంలో ఎక్కువ జాగ్రత్త అవసరం. వర్షాకాలంలో వాతావరణం తేమగా ఉండటం వల్ల జర్మ్స్ విస్తరిస్తుంటాయి. జర్మ్స్ లేదా కీటాణువులు ఎండాకాలంలో అధికవేడి కారణంగా బతికే పరిస్థితి ఉండదు. కానీ వర్షాకాలం చాలా అనువైన కాలం వీటికి. అందుకే కూరగాయలు వండటానికి ముందు ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడగాలి. 

వర్షాకాలంలో ఆకుకూరల్లో సహజంగానే కొన్ని ఆకులకు రంధ్రాలు కన్పిస్తుంటాయి. పురుగులు ఆకుల్ని తినడం ప్రారంభిస్తే ఇలానే ఉంటుంది. అందుకే కూరగాయలు, ఆకుకూరల్ని బాగా శుభ్రం చేయడమే కాకుండా అటువంటి ఆకుల్ని తొలగించేయాలి. కూరగాయల్ని ఎప్పుడూ శుభ్రంగా కడిగిన తరువాతే వండాల్సి ఉంటుంది. కానీ వర్షాకాలంలో కాస్త గోరువెచ్చని నీటితో కడిగితే మంచిది. ఇంకా చెప్పాలంటే నీళ్లలో కొద్దిగా ఉప్పువేసి కాస్సేపు కూరగాయలు అందులో వేసి..వదిలేయాలి. ఆ తరువాత శుభ్రం చేసి వండుకోవాలి.

కూరగాయలు, ఆకుకూరల వంటలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. బాగా ఉడికించి వండటం వల్ల కీటాణువులు ఏమైనా మిగిలుంటే అంతమైపోతాయి. మరోవైపు వర్షకాలంలో ఆకుకూరలతో సలాడ్ వంటివి మానేయాలి. దాంతోపాటు మార్కెట్‌లో లభించే వెజిటెబుల్ జ్యూస్ తాగకూడదు. ఎందుకంటే బయట శుచి శుభ్రత ఉండే అవకాశాల్లేవు. 

Also read: Pomegranate vs Diabetes: షుగర్ వ్యాధిగ్రస్థులు దానిమ్మ తినవచ్చా లేదా, నిజానిజాలేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News