Lunula About Your Health: మనం శరీరంలోని కొన్ని భాగాల వల్ల అనారోగ్య సమస్యలను తెలుసుకొని పరిష్కరించవచ్చని ఆరోగ్యని నిపుణులు చెబుతున్నారు. అందులో చేతి గోర్ల పై ఉండే తెల్లటి మచ్చలు ఒకటి. ఈ తెల్లటి మచ్చలను లునూలా అని పిలుస్తారు వైద్యులు. ఇవి చాలా సున్నితమైన భాగాలు అని చెబుతారు నిపుణులు. ఏదైన కారణం వల్ల ఈ మచ్చ దెబ్బతింటే గోర్లు పెరగడం చాలా కష్టమని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఈ లునూలా గురించి కొన్ని అద్భుతమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ లునూలా పెరిగే తీరు, రంగును బట్టి మన శరీరంలో ఉండే అనారోగ్య సమస్యల గురించి కూడా తెలుసుకోవచ్చని ఓ పరిశోధనలో తేలింది. అయితే ఈ లునూలా ఆకారం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటో మనం తెలుసుకుందాం.
✡ ఒకవేళ ఈ లునూలా బొటన వేలుపై కనిపించకపోతే రక్తహీనత, డిఫ్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతున్నట్టు తెలియజేస్తుంది.
✡ లునూలా బ్లూ లేదా పూర్తిగా తెలుపు రంగులో పాలిపోయి ఉంటే డయాబెటిస్ రాబోతుందని అర్థం చేసుకోవాలి.
✡ ఒకవేళ లునూలాపై ఎర్రటి మచ్చలు ఉంటే గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని తెలుసుకోవాలి.
Also Read: Morning Sickness Remedies: గర్భిణీ స్త్రీలు మార్నింగ్ సిక్నెస్ సమస్య నుంచి ఎలా బయటపడవచ్చు
✡ లునూలా ఆకారం మరీ గుర్తు పట్టలేనట్టుగా ఉంటే అజీర్తి సమస్యతో బాధపడుతున్నట్టు తెలియజేస్తుంది.
✡ లునూలా పసుపు రంగులో మారితే యాంటీ బయాటిక్ , మందులు ఎక్కువగా తీసుకున్నట్టు చెబుతుంది.
✡ శరీరంలో మలినాలు, విష పదార్థాలు పేరుకుపోతే లునూలా ఆకారం చిన్నగా మారుతుంది.
ఈ విధంగా మన చేతిపై ఉండే లునూలాను గమనించి మన శరీరంలో వచ్చే మార్పులను తెలుసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు
Also Read: Amla Health Magic: ఆమ్లా హెల్త్ మ్యాజిక్.. ఉసిరి గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter