Mild Heart Attack: మైల్డ్ హార్ట్ ఎటాక్ అంటే ఏమిటి, 5 ప్రధాన లక్షణాలు ఇవే

Mild Heart Attack: ఇటీవలి కాలంలో గుండె పోటు కేసులు అధికమౌతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సులవారికి హార్ట్ ఎటాక్ సమస్య ఎదురవుతోంది. ముఖ్యగా మైల్డ్ హార్ట్ ఎటాక్ ప్రధాన సమస్యగా మారింది. అసలీ మైల్డ్ హార్ట్ ఎటాక్ అంటే ఏమిటి, ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 24, 2024, 06:16 AM IST
Mild Heart Attack: మైల్డ్ హార్ట్ ఎటాక్ అంటే ఏమిటి, 5 ప్రధాన లక్షణాలు ఇవే

Mild Heart Attack: ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు హార్ట్ ఎటాక్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమౌతున్నాయి. దీనికి కారణం లక్షణాలు స్పష్టంగా లేకపోవడమే. సాధారణంగా గుండె పోటు లక్షణాలు తేలిగ్గానే ఉంటాయి. వీటిని సకాలంలో పరిష్కరించలేకుంటే ప్రమాదకరం. ఈ పరిస్థితినే మైల్డ్ హార్ట్ ఎటాక్ అంటారు. 

ఈ మధ్య కాలంలో 30-35 ఏళ్లకే గుండె పోటు లక్షణాలు కన్పిస్తున్నాయి. మైల్డ్ హార్ట్ ఎటాక్ ఘటనలు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు తక్షణం అలర్ట్ అవకపోతే ప్రమాదకరంగా మారుతుంది. అందుకే మైల్డ్ హార్ట్ ఎటాక్ లక్షణాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఛాతీలో కాస్త అసౌకర్యంగా ఉండటం అనేది మైల్డ్ హార్ట్ ఎటాక్‌లో ప్రధాన లక్షణం. ఛాతీ గట్టిగా ఉండటం లేదా బరువుగా ఉండటం కూడా ఉండవచ్చు. ఒక్కోసారి ఛాతీలో మంటగా కన్పించవచ్చు. ఈ లక్షణాలన్నీ కాస్సేపు ఉంటాయి. 

అకారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తితే జాగ్రత్త వహించాలి. ఇది మైల్డ్ హార్ట్ ఎటాక్ లక్షణం కావచ్చు. శ్వాస తీసుకునేటప్పుడు ఛాతీలో ఒత్తిడి లేదా నొప్పి ఉండవచ్చు. గుండె పోటు లక్షణాలు ఒక్కోసారి చలి లేదా జలుబు రూపంలో కూడా ఉండవచ్చంటారు. శరీరంలోని వేర్వేరు భాగాల్లో అకస్మాత్తుగా చలి రావడం లేదా చెమట్లు పట్టడం ప్రధాన లక్షణం. ప్రత్యేకించి రాత్రి సమయాల్లో ఉండవచ్చు. ముఖ్యంగా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఇది జరగవచ్చు.

అకారణంగా విపరీతమైన అలసట వస్తుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలి. ఇది గుండెపోటు లక్షణమే. శారీరకంగా శ్రమ లేనప్పుడు ఇలా జరిగితే అనుమానించాల్సి వస్తుంది. చేతులు, భుజాలు, మెడ నొప్పి వస్తుంటే గుండె పోటు లక్షణం కావచ్చు. ఒక్కోసారి నొప్పి తేలిగ్గానే ఉండవచ్చు. కానీ ఇది సాధారణం కాకపోవచ్చు. 

మైల్డ్ హార్ట్ ఎటాక్ అనేది గుండెలోని ప్రతి భాగాన్ని ప్రభావితం చేయవచ్చు. ఈ లక్షణాలను ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకూడదు. ఈ లక్షణాలు గుండె పోటు ముప్పును పెంచుతాయి. అందుకే జీవనశైలి, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. 

Also read: Best Immunity Foods: వర్షాకాలంలో తప్పక తినాల్సిన ఫుడ్స్ ఇవే లేకపోతే ఈ సమస్యలు తప్పవు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News