WHO Calls for COVID-19 Booster Shot Moratorium: సంపన్న దేశాలు కోవిడ్‌ బూస్టర్‌ డోసుకు సిద్ధమవుతుండడంపై డబ్ల్యూహెచ్‌వో సీరియస్‌

WHO chief seeks pause on vaccine booster doses : కొన్ని సంపన్న దేశాలు ఇప్పటికే వారి దేశాల్లో చాలా మందికి మూడో డోసు అంటే బూస్టర్‌ డోసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) సీరియస్‌ అయ్యింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 10, 2021, 07:27 PM IST
  • ఆరోగ్యంగా ఉన్న వారికి మూడో డోసు అవసరమా
  • ఈ ఏడాది చివరి వరకు బూస్టర్‌ డోసులపై మారటోరియం
  • అమెరికా ఒప్పుకునేలా లేదు
WHO Calls for COVID-19 Booster Shot Moratorium: సంపన్న దేశాలు కోవిడ్‌ బూస్టర్‌ డోసుకు సిద్ధమవుతుండడంపై డబ్ల్యూహెచ్‌వో సీరియస్‌

WHO calls for Covid vaccine booster moratorium : ప్రపంచంలో ఇప్పటికీ కోట్లాది మందికి ఒక్క కోవిడ్‌ టీకా డోసు కూడా అందలేదు. కానీ కొన్ని సంపన్న దేశాలు ఇప్పటికే వారి దేశాల్లో చాలా మందికి మూడో డోసు అంటే బూస్టర్‌ డోసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) (డబ్ల్యూహెచ్‌వో) (WHO) సీరియస్‌ అయ్యింది. 

ఈ ఏడాది చివరి వరకైనా బూస్టర్‌ డోసు ఊసు తలపెట్టవద్దని సంపన్నదేశాలకు సూచించింది డబ్ల్యూహెచ్‌వో. కొవిడ్‌ టీకాల ఉత్పత్తి, పంపిణీలను గుప్పిట్లో పెట్టుకున్న కొన్ని సంపన్న దేశాలు, వాటికి సంబంధించిన కంపెనీలు పేద దేశాలకు ఏదో అడుగూబొడుగూ టీకాలను పంపిస్తామంటే చూస్తూ ఊరుకోలేమని డబ్ల్యూహెచ్‌వో అధ్యక్షుడు టెడ్రోస్‌ అథనోం (Tedros Adhanom) అన్నారు. 

ఆరోగ్యంగా ఉన్న వారికి మూడో డోసు ఇవ్వడం అవసరమా

బూస్టర్‌ డోసులపై (Booster Doses) కనీసం సెప్టెంబరు ఆఖరు వరకైనా మారటోరియం (Moratorium) విధించాలని గత నెలలోనే డబ్ల్యూహెచ్‌వో కోరింది. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో, ఈ ఏడాది చివరి వరకు బూస్టర్‌ డోసులపై మారటోరియం కొనసాగించాలని డబ్ల్యూహెచ్‌వో అధ్యక్షుడు టెడ్రోస్‌ అథనోం స్పష్టం చేశారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న దీర్ఘ వ్యాధిగ్రస్తులకు, వృద్ధులకు, రోగ నిరోధక శక్తి బలహీనపడినవారికి బూస్టర్‌ డోసులు అవసరం కావచ్చు కానీ, ఆరోగ్యంగా ఉన్న వారికి కూడా మూడో డోసు ఇవ్వడం అవసరమా అని టెడ్రోస్‌ అథనోం ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read : SBI Warning: ఈ 4 యాప్ లను వాడుతున్నారా..? అయితే మీ అకౌంట్లో డబ్బులు మాయమవుతాయ్!

అమెరికా ఒప్పుకునేలా లేదు

కాగా మారటోరియం పొడిగింపునకు అమెరికా (America) అస్సలు ఒప్పుకునేలా లేదు. బూస్టర్‌ డోసుల ( Booster Doses) ఆవశ్యకతపై చాలా వేగంగా పరిశీలనలు చేస్తోంది. ఇక బ్రిటన్‌.. ఆస్టాజ్రెనెకా (కొవిషీల్డ్‌), ఫైజర్‌ బూస్టర్‌ డోసులకు లాంఛనంగా అనుమతి ఇచ్చింది కూడా. త్వరలో వీటి వినియోగంపై కూడా తుది నిర్ణయం తీసుకోనుంది బ్రిటన్. ఇక ఇజ్రాయెల్‌లోని (Israel) 92 లక్షల జనాభాలో 20 లక్షలమందికి ఇప్పటికే ఫైజర్‌ బూస్టర్‌ డోసు ఇచ్చారు. వారిలో 50 ఏళ్లు పైబడినవారే ఎక్కువ.

Also Read : Rs 1.8Cr for Corona Treatment: కరోనా చికిత్సకు రూ. కోటీ 80 లక్షలు వసూలు చేసిన మాక్స్ హాస్పిటల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News