COVID 4th Wave in India: ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ వస్తుందా ?

COVID 4th Wave in India: ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ వస్తుందా ? ఇదే విషయమై మేధావులు ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. తాజాగా ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ మాట్లాడుతూ.. " రాబోయే కొద్దిరోజులు భారత్ కి అంత శుభసూచికంగా లేకపోవచ్చు " అని అన్నారు.

Written by - Pavan | Last Updated : Dec 27, 2022, 10:11 PM IST
  • చైనాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయంటే..
  • కొవిడ్ ఇంకెంత కాలం ఉంటుంది ?
  • ఇండియాలో కొవిడ్ ఫోర్త్ వేవ్ వస్తుందా ? మేధావులు ఏం చెబుతున్నారు ?
COVID 4th Wave in India: ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ వస్తుందా ?

COVID 4th Wave in India: చైనాతో పాటు పలు ప్రపంచ దేశాల్లో కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో ఫోర్త్ వేవ్ వస్తుందా ? కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు మరోసారి ఇండియాలో లాక్‌డౌన్ విధిస్తారా ? అనే సందేహాలు భారతీయులను వేధిస్తున్నాయి. చైనాలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరగడానికి కారణమైన ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ కేసులు భారత్ లోనూ వెలుగు చూడటంతో భారతీయుల్లో చాలామందికి ఆ భయం మరింత ఎక్కువైంది. 

ఇదే విషయమై మేధావులు ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. తాజాగా ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ మాట్లాడుతూ.. " రాబోయే కొద్దిరోజులు భారత్ కి అంత శుభసూచికంగా లేకపోవచ్చు " అని అన్నారు. అలాగని భయపడాల్సినంత అవసరం కూడా ఏమీ లేదని మనింద్ర అగర్వాల్ స్పష్టంచేశారు. 

చైనాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయంటే..
భారత్ తో పోల్చుకుంటే చైనాలో గతంలో వచ్చిన ఇన్ ఫెక్షన్స్ తో సంక్రమించిన సహజ వ్యాధినిరోధక శక్తి చాలా తక్కువగా ఉందని.. అందువల్లే చైనాలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయని అన్నారు. న్యాచురల్ ఇమ్యునిటీ అక్టోబర్ లో 5 శాతం కంటే తక్కువే ఉందని.. అలాగే నవంబర్ లో 20 శాతం కంటే తక్కువ ఇమ్యునిటీ ఉందని గణాంకాలు వివరించారు. ప్రస్తుతం చైనాలో 60 శాతం జనాభా కంటే తక్కువ మందికి న్యాచురల్ ఇమ్యునిటీ ఉందని మనింద్ర అగర్వాల్ స్పష్టంచేశారు. 

కొవిడ్ ఇంకెంత కాలం ఉంటుంది ?
యావత్ ప్రపంచ జనాభా మొత్తానికి న్యాచురల్ ఇమ్యునిటీ వచ్చినప్పుడే కరోనావైరస్ పాజిటివ్ కేసులకు బ్రేక్ పడుతుందని.. అప్పటివరకు ఈ సమస్య తప్పకపోవచ్చని మనీంద్ర అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ వేవ్‌పై తాము జరిపిన పరిశోధనల్లో తేలింది ఏంటంటే.. న్యాచురల్ ఇమ్యునిటీ ఉంటే, ఏ వేరియంట్ ని అయినా ఎదుర్కోవచ్చని స్పష్టమైందని మనింద్ర పేర్కొన్నారు. 

ఇండియాలో కొవిడ్ ఫోర్త్ వేవ్ వస్తుందా ?
ఇండియాలో 98 శాతం మందికి న్యాచురల్ ఇమ్యునిటీ ఉంది కనుక భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ మనింద్ర అగర్వాల్ తెలిపారు. కాలక్రమంలో కొంతమంది న్యాచురల్ ఇమ్యునిటీని కోల్పోయే అవకాశం ఉందని.. అలాంటప్పుడే కొంత పరిస్థితి చేయిదాటినట్టు అనిపించవచ్చేమో కానీ అది అంతగా ప్రభావం చూపించదు అని తేల్చిచెప్పారు.

Trending News