Foods For Womens Health: నేటి కాలంలో చాలా మంది తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీనికి కారణం మారిన ఆహార అలవాట్లు, పోషక ఆహార లోపం వంటి సమస్యలు అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే అనేక పోషకాలు లభించే ఆహార పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మహిళలు పోషకాహార లోపంతో బాధపడుతుంటారు. దీని కోసం మందులను కూడా ఉపయోగిస్తారు. కాబట్టి మహిళలు పోషకాహార లోపం తలెత్తకుండా ఉండాలి అంటే పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలి ఉంటుంది. మహిళలు రోజూ తీసుకోవాల్సిన పోషకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మహిళలు తప్పకుండా తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో క్యాల్షియం ఒకటి. క్యాల్షియం ఎముకలను ధృడంగా ఉంచడంలో సహాయపడుతుంది. ౩౦ ఏళ్లు నిండిన మహిళల్లో ఎముకల సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మోనోపాజ్ లో ఉన్న స్త్రీలు క్యాల్షియం కలిగిన ఆహారాలను తీసుకోవాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా ఐరన్ లోపం అనేది తరచూగా మహిళల్లో కనిపిస్తుంది. దీని కారణంగా రక్తహీనత సమస్యతో బాధపడాల్సి ఉంటుంది. గర్బిణీ మహిళలు ఐరన్ కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల బిడ్డ ఎదుగుదల మెరుగా ఉంటుంది. ఐరన్ అనేది మాంసం, ఆకుకూరలు, బీన్స్ వంటి వాటిలో అధికంగా లభిస్తుంది.
అలాగే విటమిన్ బి9 ఉండే ఆహారాలను తప్పకుండా తీసుకోవాలి. ఇది మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. గర్బంతో ఉన్న సమయంలో పిండం అభివృద్దికి ఫోలేట్ ఎంతో సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఆకుకూరలు తీసుకోవడంలో ఈ పదార్థం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అంతేకాకుండా మెదడు పనితీరు మెరుగుగా ఉంటుంది. దీని కోసం మీరు చియా గింజలు, వాల్ నట్స్, అవిసె గింజలను తీసుకోవాల్సి ఉంటుంది.
ఎముకలను ధృడంగా ఉంచడంలో విటమిన్ డి ఎంతో అవసరమవుతుంది. పాలు, చేపలు వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల విటమిన్ డి శరీరానికి అందుతుంది.
మహిళలు మెగ్నీషియం ఉండే ఆహారాలను కూడా తీసుకోవాలి. దీని వల్ల కండరాలు, నరాల పనితీరుకు ఎంతో సహాయపడుతుంది. ఆకుకూరలు, గింజలు, తృణ ధాన్యాలు వంటిని రోజూ తీసుకోవాలి.
Also Read: Home Remedies: పొట్టనొప్పి, మలబద్ధకం, కడుపు ఉబ్బరం సమస్యలను చెక్ పెట్టే అద్భుతమైన ఇంటి చిట్కాలు..
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి గానూ విటమిన్ సి ఉండే ఆహారాలను తీసుకోవాలి. బెల్ పెప్పర్స్, బ్రోకలి వంటి వాటిని తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత విటమిన్ సి అందుతుంది.
ప్రోటీన్ ఉండే ఆహారాలను కూడా మహిళలు తీసుకోవాల్సి ఉంటుంది.
బరువును అదుపులో ఉంచడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఫైబర్ ఎంతో అవసరం. మహిళలు ఫైబర్ ఉండే ఆహారాలను కూడా తప్పకుండా తీసుకోవాలి.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో జింక్ ఎంతో సహాయపడుతుంది. జింక్ ఉండే పాలు, గింజలు, తృణ ధాన్యాలు వంటిని తీసుకోవాలి.
ఈ విధంగా మహిళలు రోజూ పోషకాలు లభించే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా అనారోగ్య సమస్య బారిన పడకుండా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Also Read: Unknown Facts About Ragi Java: రాగిజావ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter