Wrinkles Home Remedies: ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదోఒక నాటికి వృద్ధాప్యం బారిన పడకు తప్పదు. వాతావరణ మార్పులు, ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు, వయసు రీత్యా ముఖంలో ముసలితనం వచ్చే అవకాశం ఉంది. ఈరోజుల్లో యువకులు కూడా చిన్నవయసులోనే వృద్ధ్యాప్యం బారిన పడుతున్నారు. శారీరక బలహీనత, చర్మంపై ముడుతలు, నెరిసిన జట్టు, బట్టతల, మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు వృద్ధాప్య లక్షణాలు కారణం కావొచ్చు.
చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు రావడం మనలోని అలవాట్లే కారణమని అంటున్నారు వైద్య నిపుణులు. దీన్ని నివారించుకునేందుకు ఈ అలవాట్లను వదులుకోకతప్పదు.
1) కరోనా సంక్షోభం కారణంగా ఉద్యోగులందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ లో పని చేసుకుంటుండగా.. విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులతో ప్రతి రోజు ల్యాప్ టాప్ లేదా మొబైల్ తో ఎక్కువ సమయం గడపాల్సివస్తుంది. దీని వల్ల మన శరీరంపై తీవ్ర ఒత్తిడి, ఉబకాయం వంటి సమస్యల బారిన పడుతున్నారు. ఒత్తిడిని జయించేందుకు వీలైనంత తక్కువ సమయం వాటితో గడిపితే మంచిది.
2) నేటి యువతలో ఎక్కువ మంది ధూమపానం, మద్యపానానికి అలవాటు పడుతున్నారు. చిన్న వయసు నుంచే కొందరు పొగతాగడం అలవాటు చేసుకుంటున్నారు. పొగాకులోని టాక్సిన్స్ చర్మానికి సంబంధించిన ఆక్సీకరణను ప్రభావితం చేస్తాయి. ఈ కారణంగా చర్మంపై వెంటనే ముడతలు వచ్చే అవకాశం ఉంది. దీంతో శరీరంపై వృద్ధాప్య రూపం కనిపిస్తుంది.
3) ఆల్కహాల్, కెఫిన్ అధికంగా ఉన్న డ్రింక్స్ ను తీసుకోవడం వల్ల శరీరం వెంటనే డీహైడ్రేట్ అవుతుంది. వీటిని సేవించడం వల్ల శరీరంపై ఉన్న కణాలు త్వరగా చనిపోతాయి. దీంతో పాటు చర్మం, జట్టుతో పాటు ఇతర అవయవాలు బలహీనపడతాయి.
4) అతిగా ఆలోచించే అలవాటు కూడా వృద్ధాప్యానికి కారణం కావొచ్చు. తీవ్ర ఒత్తిడి వల్ల అనేక సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇలా తీవ్రంగా ఒత్తిడికి లోనవ్వడం వల్ల హార్మోన్లు ఎక్కువగా స్రవిస్తాయి. దీంతో మీరు చిన్న వయసులోనే వృద్ధాప్యం బారిన పడే అవకాశం ఉంది.
5) శరీరానికి సూర్యకాంతి చాలా అవసరం. కానీ, సూర్యకాంతిలో ఎక్కువ సేపు ఉండడం వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం వేళ సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల వల్ల చర్మంపై దద్దుర్లు, ముడతుల ఏర్పడతాయి. దీన్ని నివారించుకునేందుకు సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగిస్తే మేలు జరుగుతుంది.
6) రోజూ సరిపడా నిద్రిస్తే శరీరంలోని కణాలు ఉత్సాహంతో ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారం కణాలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఈ క్రమంలో తక్కువ నిద్ర ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. ప్రతిరోజు 6 నుంచి 8 గంటల వరకు నిద్రిస్తే మంచిది. ఆహారంలో ప్రొటీన్, ఐరన్, కాల్షియం, విటమిన్లు వంటి అవసరమైన పోషకాలను చేర్చుకోవాలి.
(నోట్: పైన పేర్కొన్న సమాచారం కొందరు నిపుణులు చెప్పిన సూచనలు మేరకు అందించబడింది. వాటిని పాటించే ముందు వైద్యుడ్ని సంప్రదించడం మంచిది. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరించడం లేదు.)
Also Read: Tooth Sensitivity Cure: టూత్ సెన్సిటివిటీతో బాధపడుతున్నారా? ఈ 5 చిట్కాలను పాటించండి!
Also Read: Sleep for Beauty: మీకు కావల్సినంత నిద్ర ఉండటం లేదా..అయితే మీ అందం తగ్గుతున్నట్టే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.