Numaish 2024: నేటి నుంచే 'నుమాయిష్‌'.. భాగ్యనగరంలో ఫిబ్రవరి 15 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు

Numaish 2024: నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ మైదానంలో ఇవాల్టి నుండి నుమాయిష్‌ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2024, 12:03 PM IST
Numaish 2024: నేటి నుంచే 'నుమాయిష్‌'.. భాగ్యనగరంలో ఫిబ్రవరి 15 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు

All India Industrial Exhibition Inauguration 2024: నేటి నుండి నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో నుమాయిష్‌ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు, మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ప్రారంభించనున్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ప్రతి సంవత్సరం జనవరి 1వ తేది నుంచి ఫిబ్రవరి 15వ తేది వరకు జరగనుంది. అంటే  ఎగ్జిబిషన్ 46 రోజుల పాటు కొనసాగుతుంది. 

ఈ ఎగ్జిబిషన్ కు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ నలుమూలల నుంచి పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపారవేత్తలు వచ్చి స్టాళ్లు ఏర్పాటు చేస్తారు. దాదాపు 2400 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌, ఫుడ్‌ కోర్టులు, పారిశ్రామికవేత్తల ఉత్పత్తులకు సబంధించిన స్టాల్స్ ఉండనున్నాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు నిర్వాహకులు.  పోలీస్‌, అగ్ని మాపక శాఖ అప్రమత్తంగా ఉన్నాయి. ఈ వేడుకకు ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడపనుంది. 

83వ ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నేపథ్యంలో నేటి నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పరిసరాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర సీపీ శ్రీనివాస్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

==> సిద్ధిఅంబర్‌బజార్‌, జాంబాగ్‌ల వైపు నుంచి నాంపల్లి వెళ్లాలనుకునే ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, భారీ వాహనాలు ఎంజే మార్కెట్‌ వద్ద అబిడ్స్‌ జంక్షన్‌ వైపు మళ్లిస్తారు.
==> పోలీసు కంట్రోల్‌ రూమ్‌, బషీర్‌బాగ్‌ నుంచి నాంపల్లి వైపు వెళ్లే వెహికల్స్ ను ఏఆర్‌ పెట్రోల్‌బంక్‌ నుంచి బీజేఆర్‌(బషీర్‌బాగ్‌) కూడలి నుంచి అబిడ్స్‌ వైపు పంపిస్తారు.
==> బేగంబజార్‌ ఛత్రీ నుంచి మాలకుంటవైపు వెళ్లే వాహనాలను అలాస్కా జంక్షన్‌ నుంచి దారుస్సలాం, ఏక్‌ మినార్‌ మసీదు, నాంపల్లి వైపు వెళ్లాల్సి ఉంటుంది.
==> దారుస్సలాం నుంచి అఫ్జల్‌గంజ్‌, అబిడ్స్‌ వైపు వెళ్లే వాహనాలను అలాస్కా జంక్షన్‌ నుంచి బేగంబజార్‌, సిటీ కాలేజీ, నయాపూల్‌ వైపు మళ్లిస్తారు
==> మూసాబౌలి, బహదూర్‌పుర వైపు నుంచి నాంపల్లి వైపు వెళ్లే వెహికల్స్ ను సిటీ కళాశాల వద్ద నయాపూల్‌, ఎంజేమార్కెట్‌ వైపు వెళ్లాల్సి ఉంటుంది.

Also Read: Anupama Parameswaran: న్యూఇయర్ రోజు టిల్లుతో కలిసి రెచ్చిపోయిన అనుపమ.. మరి ఇంత బోల్డ్ గానా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News