Beauty Parlour: భర్త కోరికతో బ్యూటీపార్లర్‌కు వెళ్లిన మహిళ.. చివరకు ఊహించని షాక్..!

Old City Woman Hair Lost: హైదరాబాద్‌ అబిడ్స్‌లోని ఓ బ్యూటీ పార్లర్ నిర్వాకం బయటపడింది. అందంగా కనిపించేందుకు వెళ్లిన ఓ మహిళ తన జుట్టు పోగొట్టుకుంది. దీంతో పోలీసులను ఆశ్రయించి.. బ్యూటీ పార్లర్‌పై ఫిర్యాదు చేసింది.  

Written by - Ashok Krindinti | Last Updated : Aug 3, 2023, 02:38 PM IST
Beauty Parlour: భర్త కోరికతో బ్యూటీపార్లర్‌కు వెళ్లిన మహిళ.. చివరకు ఊహించని షాక్..!

Old City Woman Hair Lost: కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లు.. మరింత అందంగా మారేందుకు ఓ మహిళ చేసిన బెడిసి కొట్టింది. భర్త కోరిక మేరకు బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన మహిళ.. ఉన్న జుట్టును పొగొట్టుకుంది. దీంతో భార్యాభర్తల మధ్య వాగ్వాదం చెలరేగగా.. చివరి పోలీస్ స్టేషన్‌కు చేరింది. వివరాలు ఇలా.. ఓల్డ్ సిటీకి ఓ వ్యక్తి తన భార్యను మోడల్‌గా చూడాలని అనుకున్నాడు. దీంతో భర్త కోరికతో ఆ మహిళ అబిడ్స్‌లోని బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. 

పొడుగ్గా ఉన్న జుట్టుని కట్ చేయాలని కోరగా.. అక్కడి బ్యూటీషియన్ ముందుగా జుట్టుకు ఏదో ఆయిల్ పెట్టారు. అనంతరం హెయిర్ కట్ చేయడం ప్రారంభించగా.. జుట్టు ఊడిపోవడం ప్రారంభమైంది. తలపై ఉన్న జుట్టు మొత్తం రాలిపోతుండడంతో మహిళ షాక్‌కు గురైంది. వెంటనే అక్కడి నుంచి ఇంటికి పరుగులు తీసింది. తన భార్య అందంగా తిరిగివస్తుందని భర్త భావించగా.. నెత్తిపై జుట్టు లేకుండా చూసి ఖంగుతిన్నాడు. 

దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం బాధితురాలు తన ఊడిపోయిన జుట్టును పట్టుకుని పోలీసులను ఆశ్రయించింది. తాను హెయిర్ కట్ కోసం వెళ్లిన అబిడ్స్‌ ఏరియాలోని బ్యూటీ పార్లర్‌పై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బ్యూటీషియన్‌పై కేసు నమోదు చేశారు. 

కాగా.. ఇటీవల కాలంలో బ్యూటీ పార్లర్లలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో బ్యూటీ పార్లర్‌కు వెళ్లాలంటనే మహిళలు హడలిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఫేస్‌ప్యాక్స్‌ చేయించుకున్న మహిళలకు ముఖంపై ఎర్రగా కంది నీటి పొక్కులు రావడం, ఫేస్‌మాస్క్‌ వికటించి మొహం నల్లగా మారిపోతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. అయితే బ్యూటీషియన్లకు సరైన అవగాహన లేకపోవడం, నాణ్యమైన మెటీరియల్‌ వాడకపోవడంతో మహిళలకు సమస్యలు ఎదురవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. 

Also Read: Janjatiya Vikas: జీ మీడియా ఆధ్వర్యంలో ఈ నెల 5న 'జనజాతీయ వికాస్'.. వేడుకల్లో భారీగా పాల్గొనండి  

Also Read: Tomato Price Today: టమాట ధరలకు మరింత రెక్కలు.. కేజీ ట్రిబుల్ సెంచరీ దిశగా..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News