పౌరులపై వివక్షను ఎంతకాలం కొనసాగిస్తారు: మాజీ సీఎం అఖిలేష్ యాదవ్

నిన్న లక్నో జరిగిన ర్యాలీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పై చర్చకు రావాలని సవాలు చేసిన ఒక రోజు తరువాత, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బుధవారం బీజేపీతో తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, కానీ అభివృద్ధి, నిరుద్యోగం,రైతు సమస్యలపై ముందు చర్చించాలన్నారు. 

Updated: Jan 22, 2020, 06:06 PM IST
పౌరులపై వివక్షను ఎంతకాలం కొనసాగిస్తారు: మాజీ సీఎం అఖిలేష్ యాదవ్

లక్నో:  నిన్న లక్నో జరిగిన ర్యాలీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పై చర్చకు రావాలని సవాలు చేసిన ఒక రోజు తరువాత, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బుధవారం బీజేపీతో తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, కానీ అభివృద్ధి, నిరుద్యోగం,రైతు సమస్యలపై ముందు చర్చించాలన్నారు. 

పార్టీ ఐకాన్, సోషలిస్ట్ నేత జానేశ్వర్ మిశ్రా 10వ వర్ధంతి సందర్బంగా నివాళులు అర్పించిన తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన, చర్చకు స్థలం, సమయం గురించి బీజేపీని నిర్ణయించనివ్వండి, నేను అక్కడికి చేరుకుంటాను. అయితే చర్చ అంశాలు అభివృద్ధి, ఉపాధి, యువత, రైతులు తదితర సమస్యలపై ఉండాలని ఆయన నొక్కి చెప్పారు.

మిశ్రాను గుర్తుచేసుకుంటూ, "జూనియర్ లోహియా ఎల్లప్పుడూ సామాజిక సమానత్వం కోసం పనిచేశారు. పార్టీ ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తుందని పేర్కొన్నారు. నిజమైన సమస్యల నుండి దేశం దృష్టిని మళ్లించడానికి బీజేపీ సీఏఏ, ఎన్ఆర్సీ వంటివి తెరపైకి తెచ్చి విభజన సమస్యలను తవ్వుతోందని అఖిలేష్ ఆరోపించారు.

సీఏఏపై చర్చకు రావాలని అమిత్ షా మంగళవారం అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, ప్రతిపక్ష పార్టీల నాయకులకు  సవాలు విసిరారు. సీఏఏపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ, బీజేపీ నాయకులు వాడుతున్న భాష ప్రమాదకరంగా ఉందని, ఏ విధమైన భాషను ఉపయోగిస్తున్నారో అర్ధం కావడం లేదని అని ఆయన అన్నారు. సీఏఏను ఒక్క సమాజ్ వాది పార్టీ మాత్రమే వ్యతిరేకించడం లేదని, దేశ వ్యాప్తంగా మహిళలు, పిల్లలతో సహా సాధారణ పౌరులు కూడా పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా రోడ్ల పైకి వచ్చారని ఆయన అన్నారు. 

భారతీయ జనతా పార్టీ మతం ఆధారంగా పౌరులపై వివక్షను ఎంతకాలం కొనసాగిస్తుందని ఆయన మండిపడ్డారు. ప్రజలను మనోవేదనకు గురిచేస్తున్న బీజేపీ పతనవ్వడం ఖాయమని అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..