బీహార్‌లో కొత్త స్కీమ్: పరీక్ష పాసైతే రూ.లక్ష నజరానా

అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టల్స్ లో ఉండేవారికి నెలకు వెయ్యి రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

Last Updated : May 9, 2018, 03:00 PM IST
బీహార్‌లో కొత్త స్కీమ్: పరీక్ష పాసైతే రూ.లక్ష నజరానా

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొత్త స్కీమ్‌ను తీసుకొచ్చారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే సివిల్స్ ఎగ్జామ్‌లో పాసైన ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు లక్ష రూపాయలు ఇస్తామని సీఎం ప్రకటించారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) నిర్వహించే సివిల్స్ ఎగ్జామ్ ప్రిలిమ్స్‌లో కూడా పాసైన ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు యాభై వేల రూపాయల నజరానాగా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎస్‌సీ, ఎస్‌టీ సంక్షేమ శాఖ చేసిన ప్రతిపాదనకు మంగళవారం జరిగిన బీహార్‌ క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టల్స్ లో ఉండేవారికి నెలకు వెయ్యి రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు, సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంజని కుమార్‌ సింగ్‌ తెలిపారు. ప్రిలిమ్స్‌లో పాసైన విద్యార్థులు ఖర్చుల గురించి ఆలోచించకుండా మెయిన్స్‌‌కు సన్నద్ధం అయ్యేలా విద్యార్థులను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

Trending News