close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

బస్సు లోయలో పడి 20 మంది మృతి, 30 మందికి గాయాలు

బస్సు లోయలో పడి 20 మంది మృతి, 30 మందికి గాయాలు

Updated: Jun 20, 2019, 06:23 PM IST
బస్సు లోయలో పడి 20 మంది మృతి, 30 మందికి గాయాలు
ANI photo

కులూ: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కులూ జిల్లాలో ఓ బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడిన ఘటనలో 20 మంది దుర్మరణం పాలుకాగా మరో 35 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. కులూ జిల్లాలోని బంజర్ నుంచి గదగుశానికి వస్తుండగా బంజర్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం ఘటనాస్థలానికి చేరుకున్న సహాయ బృందాలు సహాయ చర్యలు చేపట్టి బాధితులను రక్షించి లోయలోంచి బయటికి తీసుకొచ్చే పనిలో నిమగ్నమయ్యారు. బయటికి తీసుకొచ్చిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు.