UP Accident: రెండు డబుల్ డెక్కర్ బస్సులు ఢీ.. 8 మంది దుర్మరణం.. యూపీలో ఘోర ప్రమాదం

UP Road Accident: ఉత్తర్ ప్రదేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే పై రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. మరో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

Written by - Srisailam | Last Updated : Jul 25, 2022, 12:54 PM IST
UP Accident: రెండు డబుల్ డెక్కర్ బస్సులు ఢీ.. 8 మంది దుర్మరణం.. యూపీలో ఘోర ప్రమాదం

UP Road Accident: ఉత్తర్ ప్రదేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే పై రెండు బస్సులు ఢీకొన్నాయి. రెండు డబుల్ డెక్కర్ బస్సులు ఢీకొన్న ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. మరో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం సమాచరం తెలిసిన వెంటనే అధికారులు స్పాట్ కు చేరుకుని సహాయచర్యలు చేపట్టారు.

కత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ్‌పుర్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం టన జరిగింది. రెండు ప్రైవేట్ బస్సులు బిహార్ నుంచి ఢీల్లీకి వెళుతుండగా ఢీకొన్నాయి. ఓ బస్సు ఒక్కసారిగా ఆగిపోవడంతో వేగంగా వచ్చిన రెండో బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది.
క్షతగాత్రులను లఖ్నో ట్రామా సెంటర్‌కు తరలించారు. 

 

Trending News