Ration Card: రేషన్ కార్డులు ఉన్న వారందరికీ అతి పెద్ద గుడ్ న్యూస్‌

ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన ఆయుష్మాన్ కార్డుదారులు ఎలాంటి వ్యాధి వచ్చినా కూడా ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవచ్చు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 7, 2023, 04:21 PM IST
Ration Card: రేషన్ కార్డులు ఉన్న వారందరికీ అతి పెద్ద గుడ్ న్యూస్‌

Good News for Ration Card Holders: దేశ వ్యాప్తంగా రేషన్‌ కార్డులు కలిగి ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్ ను చెప్పింది. ప్రస్తుతం ఉన్న అంత్యోదయ కార్డుదారులందరికీ కూడా అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఉచిత చికిత్స అందించే విధంగా కొత్త పథకం ను తీసుకు రాబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ఆయుష్మాన్ భారత్‌ లో భాగంగా ఈ పథకంను తీసుకు వస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. 

ఇప్పటికే అంత్యోదయ కార్డులు ఉన్నవారికి ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో.. సహకారంతోనే ఈ పథకం కొనసాగబోతున్నట్లుగా కూడా చర్చ జరుగుతోంది. ప్రభుత్వం అందించే పథకాలకు అర్హులు అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఆయుస్మాస్‌ కార్డులకు కూడా అర్హులు అంటూ ఇప్పటికే కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ అధికారులు పేర్కొన్నారు. 

ప్రభుత్వం ఆయుష్మాన్‌ కార్డు కోసం రేషన్‌ కార్డును పబ్లిక్ కన్వీనియన్స్ సెంటర్‌ లో చూపించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంత్యోదయ కార్డు ఉన్న వారందరూ కూడా ఆయుష్మాన్‌ కార్డును పొందవచ్చు అంటూ ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. అంతే కాకుండా కొత్తగా కార్డులను తయారు చేయించేందుకు గాను ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన ఆయుష్మాన్ కార్డుదారులు ఎలాంటి వ్యాధి వచ్చినా కూడా ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవచ్చు. ఎలాంటి డబ్బు చెల్లించకుండానే ఆయుష్మాన్ కార్డుల ద్వారానే చికిత్స చేయించుకోవచ్చు అంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం తో పేదల ఆరోగ్యానికి భద్రత కల్పించినట్లు అవుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News