శుభమా అని పెళ్లి చేసుకుంటే కరోనా మృత్యువాకిటకు పంపేసింది. ఆశీర్వదించడానికి వచ్చిన అతిధులకు కరోనా సోకింది. కోవిడ్ 19 సోకిన ఆ పెళ్లికొడుకు ఎవరు ? ఎంతమంది అతిధులకు కరోనా సోకింది ?
ఈ అపశృతి బీహార్ లో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని పాట్నా జిల్లా పాలిగంజ్ బ్లాక్ లో జూన్ 15వ తేదీన ఈ పెళ్లి వేడుక జరిగింది. వందకు పైగా ఈ పెళ్లికి అతిధులుగా హాజరయ్యారు. గురుగావ్ లో ఇంజీనీర్ గా పనిచేస్తున్న పెళ్లికొడుకుకు పెళ్లిమంటపంలోనే ఆరోగ్యం క్షణీంచడంతో పాట్నాలోని డయేరియా ఆస్పత్రికి తరలించారు. కోవిడ్ 19 లక్షణాలుగా భావించి చికిత్స అందిస్తుండగానే...మరుసటి రోజు పెళ్లికొడుకు మరణించాడు. Also read: Indian Railways: ఇది రైలు కాదు..సూపర్ అనకొండ
మరోవైపు పెళ్లికి హాజరైన అతిధుల్లో ఒక్కొక్కరిగా కరోనా వైరస్ లక్షణాలు బయటపడసాగాయి. ఈ సంఖ్య 15కు చేరుకోగానే జూన్ 24,26 తేదీల్లో ప్రత్యేక క్యాంప్ నిర్వహించారు. పెళ్లికి లేదా పెళ్లికొడుకు అంత్యక్రియలకు హాజరైనట్టుగా భావించిన మొత్తం 4 వందల మందికి పరీక్షలు చేయగా... 111 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. మృతి చెందిన పెళ్లికొడుకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు మాత్రం ఇంకా జరగాల్సి ఉంది. Also read: Goats Quarantined : పశువుల కాపరికి కరోనా…50 మేకలు క్వారంటైన్
అటు బీహార్ లో కోవిడ్ 19 వైరస్ కేసులు 9 వేల 744కు చేరుకున్నాయి. రాష్ట్రంలో కరోనా కారణంగా ఇప్పటివరకూ 62 మంది మృతి చెందారు. 7 వేల 544 మంది చికిత్సతో కోలుకున్నారు.