కరోనా వైరస్(CoronaVirus) తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్న దేశాలలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. కాగా, జూన్ 8నుంచి దేవాలయాలకు సైతం అనుమతి లభించడంతో పుణ్యక్షేత్రాలకు భక్తుల తాకిడి ఎక్కువైంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సులువుగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని భావించిన కర్ణాటకకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. భక్తులకు ఆటోమేటిక్‌గా తీర్థాన్ని ఇచ్చే మెషీన్‌ను రూపొందించారు. Photos: ఆకాశంలో అద్భుతం.. సూర్యగ్రహణం ఎక్కడ.. ఎలా, ఫొటో గ్యాలరీ
మంగళూరుకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ దీనిపై మాట్లాడారు. ఆలయాలకు వస్తున్న భక్తులు టచ్‌లెస్ తీర్థ డిస్పెన్సర్(Touchless Theertha Dispenser) కింద చేయి పెట్టగానే అందులో నింపిన తీర్థం ఆటోమేటిక్‌గా భక్తుల చేతిలో పడుతుందన్నారు. అయితే ఎంతమేరకు తీర్థం కావాలో ముందుగానే సెట్ చేయవచ్చునని తెలిపారు. ఇది చేసేందుకు తనకు రూ.2,700మేర ఖర్చయిందన్నారు. వీటిని వాడకం ద్వారా పూజారుల నుంచి భక్తులకు గానీ, భక్తులనుంచి పూజారులకు కరోనా వైరస్ సోకే అవకాశమే లేదన్నారు. భారత్‌లో 4లక్షలు దాటిన కరోనా బాధితులు
ఆలయాల్లో, పుణ్యక్షేత్రాల్లో తీర్థం కోసం భక్తులు ఒకే దగ్గర ఉంటారు కనుక, ఈ మెషీన్ సాయంతో సోషల్ డిస్టాన్సింగ్ పాటిస్తూ భక్తులు తీర్థాన్ని పుచ్చుకోవచ్చునని అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొన్ని ఆలయాలలో తీర్థ, ప్రసాదాలు తాత్కాలికంగా నిలిపివేయడం తెలిసిందే. ఈ క్రమంలో ఇలాంటి ఆవిష్కరణలు భక్తులతో పాటు ఆలయ సిబ్బందికి ఎంతో ప్రయోజనకరంగా ఉండబోతున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ