Delhi Riots: జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్‌ ఖలీద్‌ అరెస్ట్‌

జేఎన్‌యూ విద్యార్థి నేత, కార్యకర్త ఉమర్ ఖలీద్‌ను పోలీసులు అరెస్ట్ (Umar Khalid Arrested) చేశారు. సుదీర్ఘంగా ఉమర్ ఖలీద్‌ను పోలీసులు విచారించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు.

Last Updated : Sep 14, 2020, 10:33 AM IST
Delhi Riots: జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్‌ ఖలీద్‌ అరెస్ట్‌

ఢిల్లీ అల్లర్ల కేసు (Delhi Riots)లో జేఎన్‌యూ విద్యార్థి నేత, కార్యకర్త ఉమర్ ఖలీద్‌ను పోలీసులు అరెస్ట్ (Umar Khalid Arrested) చేశారు. ఆదివారం సుదీర్ఘంగా ఉమర్ ఖలీద్‌ను పోలీసులు విచారించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు. ఖలీద్ ఫ్యామిలీకి సమాచారం అందించినట్లు పోలీసులు చెబుతున్నారు. నేడు స్టూడెంట్ లీడర్‌ను కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకంగా నిరసన నేపథ్యంలో జరిగిన అల్లర్ల కేసులో ఖలీద్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. COVID19: తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు

కఠినమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద సైతం ఖలీద్‌పై గతంలోనే కేసు నమోదు చేశారు. ఈశాన్య ఢిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా నిరసన, ఆపై జరిగిన అల్లర్లలో 50 మందికి పైగా మరణించగా వందలాంది మంది గాయపడ్డ విషయం తెలిసిందే. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటివరకు మొత్తం 751 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లు సమాచారం. దేశ రాజధానిలో జరిగిన అల్లర్లు కావడంతో కేసులను సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. US Open 2020 Winner: యూఎస్ ఓపెన్ 2020 విజేతగా డొమినిక్ థీమ్.. 71 ఏళ్ల తర్వాత సంచలనం 

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR 

Trending News