Urmila Matondkar: శివసేనలో చేరిన ఊర్మిళా మతోండ్కర్

బాలీవుడ్ నటి ఊర్మిళా మతోండ్కర్ (Urmila Matondkar) మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన ( Shiv Sena ) లో చేరారు. మంగళవారం మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray ) సమక్షంలో ముంబైలో ఆమె ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Last Updated : Dec 1, 2020, 02:54 PM IST
  • బాలీవుడ్ నటి ఊర్మిళా మతోండ్కర్ (Urmila Matondkar) మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన ( Shiv Sena ) లో చేరారు.
  • మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray ) సమక్షంలో ముంబైలో ఆమె ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
  • అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో క్రీయాశీలకంగా పనిచేసిన ఊర్మిళా మతోండ్కర్.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు.
Urmila Matondkar: శివసేనలో చేరిన ఊర్మిళా మతోండ్కర్

Urmila Matondkar joins Shiv Sena: న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి ఊర్మిళా మతోండ్కర్ ( Urmila Matondkar ) మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన ( Shiv Sena ) లో చేరారు. మంగళవారం మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ( Uddhav Thackeray ) సమక్షంలో ముంబైలో ఆమె ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మహిళా నేతలు ఉర్మిళా మతోండ్కర్‌కు పార్టీ కండువా వేసి శివసేనలోకి ఆహ్వానించారు. ముందుగా ఆమె రాజ్ ఠాక్రే దంపతుల చిత్ర పటానికి ఆమె నివాళులర్పించారు. 

అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో క్రీయాశీలకంగా పనిచేసిన ఊర్మిళా మతోండ్కర్.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఆతర్వాత పార్టీలో తలెత్తిన అంతర్గత విబేధాలతో ఆమె పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటినుంచి ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఊర్మిళ పార్టీలో చేరనున్న విషయాన్ని శివసేన నేత, పార్లమెంటు సభ్యుడు సంజయ్ రౌత్ నిన్న ధ్రువీకరించారు. ఊర్మిళా మటోండ్కర్ శివసైనికురాలని, పార్టీలో చేరుతుండటం సంతోషంగా ఉందన్నారు. Also Read: Kamal Haasan: రైతుల డిమాండ్లను ప్రభుత్వం వినాలి

అయితే ఇటీవల శివసేన తరఫున గవర్నర్‌ కోటాలో శాసనమండలికి ఊర్మిళాను పంపిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే ఊర్మిళా పేరును శివసేన గవర్నర్‌కు సిఫారసు చేసినట్టు సమాచారం. ఇదిలాఉంటే.. బాలీవుడ్ నటి కంగనారనౌత్‌, శివసేన మధ్య ఇటీవల మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఊర్మిళ మటోండ్కర్ శివసేనలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Also read: Delhi Chalo: కొనసాగుతున్న రైతుల ఆందోళన.. నేడు కేంద్రంతో సమావేశం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News