Etela Rajender: బీజేపీ ప్రచార కమిటి చైర్మెన్ గా ఈటల? తెలంగాణలో అమిత్ షా జబర్దస్త్ ప్లాన్..

 Etela Rajender: తెలంగాణలో అధికారమే బీజేపీ లక్ష్యమా? అమిత్ షా స్పెషల్ టీమ్ లు రంగంలోకి దిగాయా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే తెలుస్తోంది. తెలంగాణలో ఎట్టిపరిస్థితుల్లోనే కషాయ జెండా ఎగరాలని భావిస్తున్న బీజేపీ పెద్దలు.. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించారని తెలుస్తోంది.

Written by - Srisailam | Last Updated : Jun 20, 2022, 07:12 AM IST
  • అమిత్ షాతో ఈటల రాజేందర్ భేటీ
  • ఈటలకు పార్టీ కీలక బాధ్యతలు
  • తెలంగాణలో అధికారం కోసం వ్యూహం
Etela Rajender: బీజేపీ ప్రచార కమిటి చైర్మెన్ గా ఈటల? తెలంగాణలో అమిత్ షా జబర్దస్త్ ప్లాన్..

Etela Rajender: తెలంగాణలో అధికారమే బీజేపీ లక్ష్యమా? అమిత్ షా స్పెషల్ టీమ్ లు రంగంలోకి దిగాయా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే తెలుస్తోంది. తెలంగాణలో ఎట్టిపరిస్థితుల్లోనే కషాయ జెండా ఎగరాలని భావిస్తున్న బీజేపీ పెద్దలు.. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించారని తెలుస్తోంది. ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కేడర్ లో జోష్ నింపుతున్నారు. ఇటీవలే తెలంగాణకు చెందిన బీజేపీ నేత లక్ష్మణ్ ను యూపీ నుంచి రాజ్యసభకు పంపించింది బీజేపీ. తాజాగా తెలంగాణకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

హుజురాబాద్ లో విజయం సాధించి కేసీఆర్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఈటల రాజేందర్ కు బీజేపీ పెద్దలు కీలక పదవి ఇచ్చే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాతో ఢిల్లీలో ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు రాజేందర్. దాదాపు 30 నిమిషాల పాటు చర్చించారు. అమిత్ షా నుంచి కాల్ రావడంతో ఆదివారం హడావుడిగా ఢిల్లీ వెళ్లారు రాజేందర్. ఏనుగు రవీందర్ రెడ్డితో కలిసి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయాలపై చర్చించారు. తెలంగాణలో బలమైన నేతగా  ఉన్న రాజేందర్ కు కీలక బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్న బీజేపీ హైకమాండ్... అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టిందని తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ ప్రచార బాధ్యతలు ఈటలకు అప్పగించనున్నారని తెలుస్తోంది. దీనిపై ఈటలతో మాట్లాడిన అమిత్ షా.. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాని సూచించినట్లు తెలుస్తోంది. ఈటలకు పదవిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చని చెబుతున్నారు. హైదరాబాద్ లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందే ఈటలకు పదవిపై ప్రకటన వస్తుందని సమాచారం.

ఈటలకు కీలక పదవి ఇవ్వడం వెనుక అమిత్ షా భారీ వ్యూహమే ఉందని తెలుస్తోంది. గత రెండేళ్లుగా తెలంగాణలో బీజేపీలోకి భారీగా వలసలు జరిగాయి. కాంగ్రెస్ తో పాటు టీఆర్ఎస్ నుంచి చాలా మంది సీనియర్ లీడర్లు కమలం గూటికి చేరారు. అయితే బీజేపీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు గౌరవం లేదని.. పదవులు కూడా రాడవం లేదనే ప్రచారం జరుగుతోంది. సీనియర్లకు గుర్తింపు లేదని... వాళ్లంతా అసంతృప్తిలో ఉన్నారనే చర్చ సాగుతోంది. రాజ్యసభ ఎంపిక విషయంలో పాత కాపునే కమలం పార్టీ ఎంచుకోవడంతో.. వలస నేతల్లో మరింత ఆందోళన పెరిగిందని తెలుస్తోంది. పాత నేతలకే పదవులు వస్తాయా అన్న చర్చ మొదలైంది. ఈ చర్చ రాబోయే రోజుల్లో వలసలపై ప్రభావం చూపుతుందని గ్రహించిన హైకమాండ్.. దిద్దుబాటు చర్యలు చేపట్టిందని చెబుతున్నారు. ఈటల రాజేందర్ కు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా.. వలస నేతలకు ప్రాధాన్యత ఉంటుందనే సంకేతం ఇచ్చే  ప్లాన్ చేస్తుందని అంటున్నారు. ఈటలకు పదవి ఇస్తే.. పార్టీలోకి మళ్లీ వలసలు ఊపందుకుంటాయని అంటున్నారు.

తెలంగాణలో బలమైన బీసీ నేతగా ఉన్నారు ఈటల రాజేందర్. టీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఓ సామాజిక వర్గానికే పెద్దపీట అనే ప్రచారం ఉంది. దీంతో బీసీ కార్డుతో ఎన్నికలకు వెళ్లారని బీజేపీ హైకమాండ్ ప్లాన్ చేస్తుందని అంటున్నారు. బీసీ వర్గానికే చెందిన బండి సంజయ్ పార్టీ చీఫ్ గా ఉండగా.. ప్రచార కమిటి చైర్మెన్ గా ఈటలను నియమిస్తే బీసీల్లో పార్టీకి మరింత పట్టు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. బీసీ కార్డుతోనే లక్ష్మణ్ ను పెద్దల సభకు పంపారని చెబుతున్నారు.

Read also: Teacher dance with Students: విద్యార్థినులతో కలిసి టీచరమ్మ స్టెప్పులు..సోషల్‌ మీడియాలో వైరల్..!

Read also:  KTR Letter to Nirmala Sitharaman: తెలంగాణ ఆస్తులను అమ్మే హక్కు ఎవరు ఇచ్చారు..కేంద్రానికి కేటీఆర్ లేఖాస్త్రం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News