Black Fungus Threat: కరోనా మహమ్మారి నుంచి కోలుకునేలోగా బ్లాక్ ఫంగస్ రూపంలో మరో ముప్పు వెంటాడుతోంది. దేశవ్యాప్తంగా మ్యుకోర్‌మైకోసిస్ తీవ్ర అందోళనకరంగా మారింది. బ్లాక్ ఫంగస్ ప్రాణాంతకం కావచ్చని ఎయిమ్స్ వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ధాటికి ఇప్పటికే దేశలోని ప్రజలు విలవిల్లాడుతున్నారు. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటం తీవ్ర ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే దేశంలో నెలకొన్న కరోనా విపత్కర పరిస్థితులు రోజురోజుకూ దయనీయంగా మారుతున్నాయి. ఆక్సిజన్ అందక కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్స్ లేక పరిస్థితి విషమిస్తోంది. దీనికితోడు ఇప్పుడు కొత్తగా బ్లాక్ ఫంగస్ వెంటాడుతోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ బాధితుల్లో మ్యుకోర్‌మైకోసిన్ అనే అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్ కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై ఎయిమ్స్ ఛీఫ్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా (AIIMS Chief Director Dr Randeep Guleria) ఆందోళన వ్యక్తం చేశారు.
కోవిడ్ చికిత్స పొందుతున్నవారిలో లేదా కోవిడ్ నుంచి రికవరీ అయినవారికి ఎక్కువగా బ్లాక్ ఫంగస్ (Black Fungus) సోకడమనేది సెకండ్ వేవ్‌లోనే కన్పిస్తోందని ఎయిమ్స్ ఛీఫ్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా తెలిపారు. మ్యుకోర్ మైకోసిస్ (Mucormycosis) బారినపడిన వారిలో 90 శాతం మంది డయాబెటిస్ బాధితులే ఎక్కువగా ఉన్నారు. అందుకే కోవిడ్ రోగులు చక్కెర స్థాయిని పరిశీలిస్తూ నియంత్రించాల్సిన అవసరముందని సూచించారు. క్లినికల్ ఎక్స్‌లెన్స్ మేనేజ్‌మెంట్ కార్యక్రమంలో రాష్ట్రాలు, జిల్లా అధికారుల్ని డాక్టర్ గులేరియా అప్రమత్తం చేశారు. డయాబెటిస్ రోగులు, స్టెరాయిడ్ తీసుకునేవారే ఎక్కువగా మ్యుకోర్‌మైకోసిస్ ఫంగస్ బారినపడుతున్నట్టు తెలుస్తోందని తెలిపారు. ఇష్టారాజ్యంగా స్టెరాయిడ్ వాడుతున్నవారి రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. గుజరాత్‌లోని ఆసుపత్రుల్లో 5 వందలకు పైగా మ్యుకోర్‌మైకోసిస్ కేసుల్ని గుర్తించారు. మరోవైపు కోవిడ్ చికిత్సలో వినియోగించే టోసిలిజుమాబ్ ఔషధం ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌కు దారి తీస్తుందా లేదా అనేది గుజరాత్ వైద్యులు పరిశీలిస్తున్నారు.
Also read: Tauktae Cyclone: తౌక్టే తుపాను ప్రభావం, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook