Assam DSP Kirannath Arrested for Raping Minor Girl: మహిళల సెఫ్టీ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకొస్తున్నాయి. అయిన కూడా మహిళల భద్రత అనేది ప్రశ్నార్థకంగానే మారిందని చెప్పుకొవచ్చు. గుడి, బడి, బస్టాండ్, రైల్వే స్టేషన్ ఎక్కడ కూడా మహిళల భద్రతకు సెఫ్టీ లేదని చెప్పుకొవచ్చు. ప్రతిరోజు మహిళలను అత్యాచారానికి గురైన ఘటనలు వార్తలలో ఉంటునే ఉన్నాయి. ఆఫీసులు, పోలీసు స్టేషన్ లలో కూడా మహిళలకు అంత భద్రత లేదని చెప్పుకొవచ్చు. అన్యాయం జరిగితే కాపాడాల్సిన పోలీసులు కూడా కీచకులుగా మారి మహిళలను వేధిస్తున్నారు. అచ్చం ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం పోలీసు శాఖలో తీవ్ర దుమారంగా మారింది.
Read More: Snake Venom Rave Party: పాముల విషంతో రేవ్ పార్టీ.. బిగ్ బాస్ OTT 2 విన్నర్ అరెస్టు..
పూర్తివివరాలు..
అస్సాంలో పోలీసు బాస్ చేసిన ఘటన కార్యం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేర్గావ్‌లోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కిరణ్ నాథ్ .. తన ఇంట్లో పనిచేస్తున్న మైనర్ బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా బాలికను ఇంట్లోనుంచిబైటకు వెళ్లకుండా కూడా నిర్బంధించాడు. బాలిక కుటుంబాన్ని సైతం బెదిరింపులకు గురిచేశాడు. బాలిక కిరణ్ నాథ్ బంగ్లానుంచి తప్పించుకుని వచ్చి ఇంట్లో వాళ్లకు దారుణం గురించి చెప్పింది. ఆమె కుటుంబ సభ్యులు శనివారం రాత్రి గోలాఘాట్ జిల్లాలోని దేర్గావ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో దారుణం వెలుగు చూసింది. పోలీసులు ఆదివారం నాథ్‌పై కేసు నమోదు చేశారు. ఈ ఘటన పోలీసు డిపార్ట్ మెంట్ లో తీవ్ర సంచనంగా మారింది.
ఈ ఘటనలో పోలీసులు.. కిరణ్ నాథ్‌గా గుర్తించబడిన DSPని ఆదివారం సాయంత్రం ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 376, 506 మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టం, 2012 సెక్షన్ 6 కింద అరెస్టు చేశారు. అస్సాం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ ఆదివారం సాయంత్రం X లో ఒక పోస్ట్ ద్వారా ఘటన గురించి సమాచారాన్ని పంచుకున్నారు. "లచిత్ బోర్ఫుకాన్ పోలీస్ అకాడమీ (LBPA) పోలీసు డీఎస్పీని కిరణ్ నాథ్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఇలాంటి ఘటనలు ఎవరు చేసిన వదిలే ప్రసక్తి లేదని డీజీపీ స్పష్టం చేశారు. ఘటనపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని, మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. బాలికతో పాటు ఇతర సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన మాత్రం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook