మీ వద్ద మాస్టర్ కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, వీసా కార్డు ఉందా? అయితే ఓ నిమిషం ఆగండి. ఈ రోజు నుండి అంటే అక్టోబర్ 15, 2018 నుండి ఈ కార్డులు పనిచేయకపోవచ్చు. ఈ కంపెనీలు ఇండియాలో ఏటీఎం/డెబిట్ మరియు క్రెడిట్ కార్డు సేవలను గత కొన్నేళ్లుగా అందిస్తున్నాయి. ఈ కార్డులతో పాటు ఫేస్బుక్, పేపాల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ మరియు ఇతర ఇతర విదేశీ చెల్లింపు సంస్థలపై కూడా ఈ ప్రభావం కనిపించనుంది.
దీనికి ప్రధాన కారణం ఈ సంస్థలు ఆర్బీఐ యొక్క స్థానిక డేటా నిల్వ విధానాన్ని ఆమోదించడానికి నిరాకరించడమే. భారతదేశంలో డేటా నిల్వ యొక్క సర్వర్‌ను ఏర్పాటు చేసి, మార్గదర్శకాలను పాటించాలని ఈ సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 6 నెలలు గడువు ఇచ్చింది.
వీసా, మాస్టర్ కార్డ్ వంటి చెల్లింపు సంస్థలు.. భారతదేశంలో స్థానిక డేటా నిల్వ (డేటా లోకలైజేషన్) సమస్యపై చర్చించారు. స్థానిక డేటా నిల్వ వ్యవస్థ ఖర్చు గణనీయంగా పెరగవచ్చని, ఆ ప్రక్రియ అంత సులభంగా అనుసరించలేమని ఈ కంపెనీలు చెబుతున్నాయి. డేటా లోకలైజేషన్ పాలసీ, భారతదేశంలో ఉన్న అమెరికా వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని చెప్పారు.
ఆర్బీఐ యొక్క కొత్త మార్గదర్శకాల ప్రకారం, ప్రతి చెల్లింపు సంస్థ.. చెల్లింపు వ్యవస్థకు సంబంధించి స్థానిక డేటా నిల్వను కలిగి ఉండటం తప్పనిసరి. ఇది అక్టోబర్ 16 నుండి అమలులోకి వస్తుంది. భారతదేశంలో 78 చెల్లింపు సంస్థలు పనిచేస్తున్నాయి. వీటిలో 62 ఆర్బిఐ మార్గదర్శకాలను ఆమోదించాయి. వీటిలో అమెజాన్, వాట్సాప్ మరియు ఆలీబాబా వంటి ఇ-కామర్స్ కంపెనీలు ఉన్నాయి.
ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను 16 కంపెనీలు నిరాకరించాయి. భారతదేశంలో డేటా నిల్వ వ్యవస్థ ఖర్చును పెంచుకోవడమే కాదు డేటా యొక్క భద్రత గురించి ప్రశ్నలు పుట్టుకొస్తాయని.. గడువును పెంచాలని ఆర్బిఐని కోరారు. పెద్ద మరియు విదేశీ చెల్లింపు సంస్థలు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరింది. కొత్త మార్గదర్శకాలను ఆమోదించడానికి చెల్లింపు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ఆర్బిఐ స్పష్టంగా పేర్కొంది. ఈ కంపెనీలకు ఇప్పటికే 6 నెలల సమయం ఇచ్చామని తెలపింది.
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
అయితే భారతదేశం బ్రాడ్ బ్యాండ్ ఇండియా ఫోరం (బీఐఎఫ్) డేటా లోకలైజేషన్ తప్పనిసరి అని నిబంధన పెడితే.. దేశ ఆర్థిక వ్యవస్థ, ఆర్థికాబ్ధివృద్ధిపై ప్రభావితం పడుతుందని పేర్కొంది. బీఐఎఫ్ ప్రకారం డేటా లోకలైజేషన్ వలన ఖర్చు, భారం పెరుగుతుందని.. తద్వారా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది.
డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పురోగతిని ప్రోత్సహిస్తూనే పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరచి పరిరక్షించడమే లక్ష్యంగా తగు సూచనలు చేస్తూ కేంద్రానికి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శ్రీకృష్ణ సారథ్యంలో నిపుణుల కమిటీ జులైలో నివేదిక, ‘వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు-2018’ ముసాయిదాను సమర్పించిన సంగతి తెలిసిందే..! ఈ కమిటీ ఇచ్చిన 67 పేజీల ముసాయిదాను ప్రభుత్వం ప్రజల అభిప్రాయ సేకరణకు బహిర్గతం చేసింది. దీనిపై విస్తృతస్థాయి చర్చ జరిగి..ఆ చర్చలో వచ్చిన ఫలితాలను కూడా పరిగణనలోకి తీసుకుని ముసాయిదాను చట్టరూపంలోకి తీసుకురానుందని సమాచారం.