అలర్ట్: ఏటీఎం కార్డు వినియోగదారులకు బ్యాడ్ న్యూస్ !

ఏటీఎం కార్డు వినియోగదారులకు ఝలక్ ఇచ్చిన క్యాట్‌మి!

Last Updated : Nov 24, 2018, 05:25 PM IST
అలర్ట్: ఏటీఎం కార్డు వినియోగదారులకు బ్యాడ్ న్యూస్ !

ఏటీఎం కార్డుతో ఎప్పుడంటే అప్పుడు తమ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని ఆస్వాదిస్తున్న ఖాతాదారులకు క్యాట్‌మి (కన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ) ఓ హెచ్చరిక జారీ చేసింది. గతంలో నోట్ల రద్దు తర్వాత నగదు కోసం ఎదుర్కున్నటువంటి కష్టకాలాన్ని మరోసారి ఎదుర్కోక తప్పదేమోనని కన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ సందేహం వ్యక్తంచేసింది. అందుకు కారణం వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా దేశంలో ఉన్న ఏటీఎంలలో సగం ఏటీఎంలు మూతపడే ప్రమాదం ఉండటమేనని ఆ సంస్థ తేల్చిచెప్పింది. 

ఏటీఎం నెట్‌వర్క్ నిర్వహణకు సంబంధించిన నియమనిబంధనల్లో వచ్చిన మార్పులు ఏటీఎం సేవలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని, ఈ పరిస్థితుల్లో ఏటీఎం సేవలు అందించడం సాధ్యపడకపోవడమే ఏటీఎంలను మూసేయడానికి కారణం అని క్యాట్‌మి స్పష్టంచేసింది. సుమారు 1.13 లక్షల ఏటీఎం కేంద్రాలను మూసేసే అవకాశం ఉందని ప్రకటించిన క్యాట్‌మి.. ఒకవేళ అదేకానీ జరిగితే, నోట్ల రద్దు తర్వాత నగదు కోసం జనం ఏటీఎంల వద్ద ఎన్ని తిప్పలు పడ్డారో మళ్లీ అటువంటి రోజులు దాపురించే ప్రమాదం ఉందని గుర్తుచేసింది.

Trending News