అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి

అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ శాంతి సందేశం

Updated: Nov 9, 2019, 11:35 AM IST
అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి

న్యూ ఢిల్లీ: అయోధ్య రామజన్మ భూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించనున్న నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ఓ విజ్ఞప్తి చేశారు. అయోధ్య కేసులో సుప్రీం కోర్టు వెల్లడించే తీర్పు ఏదైనా.. దానిని ఒక వర్గానికి విజయంగా మరో వర్గానికి ఓటమిగా భావించకూడదని ప్రధాని మోదీ విజ్ఞప్తిచేశారు. ఈ తీర్పుతో భారతదేశం శాంతి, ఐక్యత, సద్భావన, గొప్ప సంప్రదాయాన్ని మరింత బలోపేతం చేయడం కోసమే మనందరం పాటుపడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

ప్రధాని మోదీ పిలుపుతో బీజేపి నేతలు, శ్రేణులు సైతం తమ తమ నియోజకవర్గాల పరిధిలోని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. బీజేపి తరపున ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని స్థానిక అధికార యంత్రాంగానికి హామీ ఇస్తూనే.. అసాంఘిక శక్తులు రెచ్చిపోకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పలువురు నేతలు విజ్ఞప్తిచేశారు.