Baba Ramdev: నా కంటికి మహిళలు ఏం ధరించకపోయినా బాగుంటారు- బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Baba Ramdev: పతంజలి రాందేవ్ బాబా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళల్ని కించపరుస్తూ..అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారు. అది కూడా మాజీ ముఖ్యమంత్రి భార్య సమక్షంలో. అసలేం జరిగిందంటే..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 25, 2022, 06:41 PM IST
Baba Ramdev: నా కంటికి మహిళలు ఏం ధరించకపోయినా బాగుంటారు- బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు

మహారాష్ట్రలో పతంజలి రాందేవ్ బాబా నోరు జారారు. మహిళలపై అసభ్యకరంగా, కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య సమక్షంలో రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మహారాష్ట్రలోని థానేలో పతంజలి యోగా పీఠం, ముంబై మహిళా పతంజలి యోగా సమితి సంయుక్తంగా యోగాసైన్స్ శిబిరాన్ని నిర్వహించాయి. ఈ శిబిరానికి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతా ఫడ్నవిస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబా రాందేవ్ మహిళల్ని ఉద్దేశించి మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మహారాష్ట్రలో గత కొద్దిరోజులుగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా మహిళల్లో ఆగ్రహం పెల్లుబుకుతుంది. ఈ క్రమంలో యోగా గురు రాందేబవ్ బాబా సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అది కూడా మహిళల వస్త్రధారణపై అసభ్యకరంగా మాట్లాడారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే బాబా రాందేవ్ ఈసారి మహిళల్ని ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు.

ధానేలో జరిగిన కార్యక్రమంలో బాబా రాందేవ్ మహిళల్ని ఉద్దేశించి మాట్లాడుతూ...నోరు జారారా లేదా ఉద్దేశ్యపూర్వకంగా మాట్లాడారా అనేది తెలియదు. 

రాందేవ్ బాబా వ్యాఖ్యలు

మహిళలకు చీరల్లో అందంగా కన్పిస్తారు. సల్వార్ సూట్స్‌లో కూడా బాగుంటారు. నా కంటికైతే అసలేమీ ధరించకపోయినా అందంగా కన్పిస్తారు. ఇంత పచ్చిగా మాట్లాడింది కూడా మహిళల సమావేశంలో. అది కూడా మహారాష్ట్ర డిప్యూటీ ఛీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతా ఫడ్నవిస్ సమక్షంలో కావడం గమనార్హం. 

ఈ యోగా శిబిరానికి మహిళలు యోగా డ్రెస్సుల్లో వచ్చారు. అదే రోజు ఉదయం యోగా సైన్స్ శిబిరం జరిగింది. ఆ తరువాత మహిళలకు యోగా శిక్షణా కార్యక్రమం ఏర్పాటైంది. ఇది ముగిసిన వెంటనే మహిళల సమావేశం ప్రారంభమైంది. దాంతో మహిళలకు చీరలు ధరించే సమయం లేకపోయింది. ఈ పరిస్థితిపై మాట్లాడిన బాబా రాందేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. చీరలు ధరించేందుకు సమయం లేనందున ఫరవాలేదని..ఇప్పుడైనా ఇంటికెళ్లి చీరలు ధరించి రావచ్చన్నారు. మహిళలు చీరల్లో, సల్వార్ సూట్స్‌లో బాగుంటారని..తన కంటికైతే మహిళలు ఏం ధరించకోపోయినా బాగుంటారని వ్యాఖ్యానించారు.

బాబా రాందేవ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. మహిళల్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు. బాబా రాందేవ్ తన నైజాన్ని బయటపెట్టారని ఆగ్రహిస్తున్నారు. 

Also read: Delhi MCD Election 2022: అరవింద్ కేజ్రీవాల్ హత్యకు బీజేపి కుట్ర ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News