7th Pay Commission DA Hike News: కొత్త ఏడాదిలో జీతాల పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. మార్చి నెలలో డీఏ పెంపు ప్రకటనపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. గతేడాది రెండుసార్లు నాలుగు శాతం చొప్పున పెంచడంతో మొత్తం డీఏ 46 శాతానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈసారి పెంపు కూడా 4 శాతం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు. అయితే జీతాల పెంపు ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జనవరి 1వ తేదీ నుంచి అమలు చేస్తారు. చివరగా నవంబర్‌లో డీఏ పెంపు ప్రకటన రాగా.. జూలై 1వ తేదీ నుంచి అమలు చేసింది. ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు డీఏను పెంచుతున్న విషయం తెలిసిందే.
ఈసారి డీఏ పెంపుతోపాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి అద్దె అలవెన్స్‌లో మరో పెంపు ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. అద్దె ఇంట్లో నివసించే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హెచ్‌ఆర్‌ఏ ప్రయోజనం పొందుతారు. అయితే HRA మొత్తం నగరం నుంచి నగరానికి మారుతూ ఉంటుంది. ఉదాహరణకు టైర్-II లేదా టైర్-III నగరాల్లో నివసించే ఉద్యోగి కంటే టైర్-1 నగరాల్లో నివసించే ఉద్యోగి ఎక్కువ HRA పొందుతారు. ఉద్యోగి నివసించే నగరానికి HRA లోబడి ఉంటుంది. నగర వర్గాల ఆధారంగా HRAను 3 వర్గాలు X, Y, Z గా విభజించారు.
ఒక నగరంలో 50 లక్షలు అంతకంటే ఎక్కువ జనాభా ఉంటే 'X' కేటగిరీగా ఎంపిక చేశారు. ఈ కేటగిరీ కింద వచ్చే ఉద్యోగులకు సెంట్రల్ పే కమిషన్ (సీపీసీ) సిఫారసు మేరకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏను పొందుతారు. 5 లక్షల నుంచి 50 లక్షల మధ్య జనాభా ఉన్న నగరాలు 'వై' కేటగిరీ కిందకు వస్తాయి. ఈ సిటీ కేటగిరీలో నివసిస్తున్న ఉద్యోగులు ప్రాథమిక జీతంలో 16 శాతం హెచ్‌ఆర్‌ఏ పొందేందుకు అర్హులు. చివరగా 'Z' కేటగిరీలో 5 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న ఉద్యోగులు ఉన్నారు. ఇక్కడ ఉన్న ఉద్యోగులకు 8 శాతం HRA అందుతోంది.
బడ్జెట్ 2024లో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని ఉద్యోగులు భావిస్తున్నారు. మంత్రివర్గం ఆమోదం లభిస్తే.. అది బడ్జెట్ వ్యయంలో చేర్చే అవకాశం ఉంటుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంచితే ఆటోమేటిక్‌గా కేంద్ర ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి. ఫిట్‌మెంట్ అంశం ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రాథమిక వేతనాన్ని నిర్ణయిస్తారు. బేసిక్ శాలరీ ఆధారంగా అలవెన్సులు కూడా నిర్ణయిస్తారు.
Also Read: Shoaib Malik Third Marriage: సానియా మీర్జాకు భారీ షాక్.. మళ్లీ పెళ్లి చేసుకున్న భర్త షోయబ్ మాలిక్
Also Read: TANA Elections: సంచలనం రేపిన 'తానా' ఎన్నికల్లో కొడాలి నరేన్ జయభేరి.. విజేతలు ఎవరెవరంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter