Viral Video: రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. ప్రేమను ఒప్పుకోలేదని నడి రోడ్డుపైనే యువతిపై కాల్పులు!

A vegetable vendor daughter shot at Patna. తన ప్రేమను అంగీకరించలేదనే కారణంగా పట్టపగలే ఓ ప్రేమోన్మాది నడి రోడ్డుపై రెచ్చిపోయాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 18, 2022, 03:27 PM IST
  • రెచ్చిపోయిన ప్రేమోన్మాది
  • కూరగాయల వ్యాపారి కూతురిపై కాల్పులు
  • ప్రేమ వ్యవహారమే కారణం
Viral Video: రెచ్చిపోయిన ప్రేమోన్మాది..  ప్రేమను ఒప్పుకోలేదని నడి రోడ్డుపైనే యువతిపై కాల్పులు!

A vegetable vendor daughter shot at Patna: బీహార్‌ రాష్ట్ర రాజధాని పట్నాలో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదనే కారణంగా పట్టపగలే ఓ ప్రేమోన్మాది నడి రోడ్డుపై రెచ్చిపోయాడు. ఈ ఘటన బుధవారం సిపారా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఓ కూరగాయల వ్యాపారి కూతురిని ఓ యువకుడు తుపాకీతో కాల్చాడు. యువకుడి కాల్పుల్లో గాయపడ్డ యవతి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

యువతి కాల్పులకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ప్రకారం... పాట్నాలోని బీర్ పీఎస్‌ సిపారా ప్రాంతంలోమీ ఇంద్రపురి కాలనీలో ఓ స్థానిక కూరగాయల వ్యాపారి కూతురు రోడ్డుపై నుంచి వీధిలోకి వస్తోంది. ఓ యువకుడు ఆ వీధిలో ఆమెను దాటుకుని వచ్చి నిల్చున్నాడు. ఆమె అతడిని దాటి వెళ్లిన తర్వాత.. తనతో తెచ్చుకున్న తుపాకీని సంచిలో నుంచి తీసి వెంబడించాడు. వెనక నుంచి యువతి మెడపై కాల్చాడు. దాంతో ఆ యువతి అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. అనంతరం యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. 

రక్తపు మడుగులో పడి ఉన్న యువతిని స్థానికులు గుర్థించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని బీర్ పీఎస్‌ పోలీసులు తెలిపారు. కాల్పులకు ప్రేమ వ్యవహారమే కారణమని వారు వెల్లడించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువకుడు కాల్పులకు తెగబడ్డ ఘటన ఓ ఇంటికి ఉన్న కెమెరాలో రికార్డయింది.

Also Read: నేడే భారత్, జింబాబ్వే తొలి వన్డే.. లైవ్‌ స్ట్రీమింగ్, టైమింగ్ డీటెయిల్స్ ఇవే!

Also Read: Sukumar Sudden Shock: పుష్ప నటుడికి షాకిచ్చిన సుకుమార్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News